చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ ప్రమేయంపై అభియోగాలు దాఖలు
విజయవాడ : మద్యం కుంభకోణం కేసు (Liquor scam case) లో మరో అనుబంధ అభియోగపత్రాన్ని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ముడుపుల రవాణాలో కీలకంగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, అతని మిత్రుడు వెంకటేశ్నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగపత్రాన్ని సిట్ దాఖలు చేసింది.
జగన్ కు అత్యంత సన్నిహితుడు మద్యం కేసులో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy), 34వ నిందితుడిగా ఉన్న అతని స్నేహితుడు వెంకటేశ్నా యుడు, 35వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి ప్రధాన అనుచరుడు బాలాజీకుమార్ యాదవ్, 36వ నింది తుడిగా ఉన్న వ్యక్తిగత సహాయకుడు నవీన కృష్ణల ప్రమేయం, పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగపత్రంలో పూర్తి వివరాలతో పొందుపరిచినట్లు సమాచారం.
దీని కోసం తుడా వాహనాలు
మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకున్న ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించినట్లు సిట్ (SIT) దర్యాప్తు లో తేల్చింది. ముడుపుల సొమ్ము తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్నాయుడు కీలకంగా ఉన్నట్లు, బాలాజీ, నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ గుర్తించింది. దీని కోసం తుడా వాహనాలు వినియోగించినట్లు తేల్చింది. ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో ఈ అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం.

కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్లు, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం, ఫోరెన్సిక్ నివేదికల్ని (Forensic reports) ఈ అభియోగపత్రంతో పాటు కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనంలో కొంత మొత్తాన్ని వైట్లోకి మార్చుకునేందుకు చెవిరెడ్డి తన బినామీల పేరిట పలుడొల్ల కంపెనీలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున భూముల లావాదేవీల నిర్వహించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
నల్లధనంతో కొనుగోలు చేసేందుకు
తిరుపతి జిల్లా,గూడూరు సమీపంలో 6 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించి 260 ఎకరాల భూమి కొనుగోలు చేసి రెండు నెలల్లోనే దాన్ని 26 కోట్లకు విక్రయించి, ఆ సొమ్మంతా వైట్గా మార్చుకున్నట్లు సిట్ గుర్తించింది. తిరుచానూరులో ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిట ఉన్న 2.93 ఎకరాల భూమిని నల్లధనంతో కొనుగోలు చేసేందుకు 8 బినామీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. మద్యం ముడుపుల సొత్తుతో టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం నిర్మాణానికి చెవిరెడ్డి యత్నించినట్లు తేలింది.
చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మోహిత్రెడ్డి, వెంకటేశ్నాయుడు ఈ ఏడాది జనవరిలో ఆ దేశానికి వెళ్లినట్లు సిట్ గుర్తించింది. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) సమీపంలో ఏర్పాటు చేసుకున్న మద్యం ముడుపుల డెన్కు హ్యాండ్లర్గా వ్యవహరించిన ప్రణోయ్ ప్రకాశ్తో చెవిరెడ్డి భేటీ అయినట్లు సిట్కు ఆధారాలు లభ్యమయ్యాయి. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పట్టుబడ్డ 8 కోట్ల 94 లక్షల మద్యం ముడుపుల సొమ్ముతో చెవిరెడ్డికి ఉన్న సంబంధాల గుట్టును సిట్ రట్టు చేసింది.
తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న మద్యం
ఈ వివరాలన్నీ సమగ్రంగా తాజా అభియోగపత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ కేసులో సిట్ జులై 19న ప్రధాన అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఆగస్టు 11న మొదటి అనుబంధ అభియోగపత్రం వేసింది. నేడు రెండో అనుబంధ అభియోగపత్రాన్ని వేసింది. ఇవాళ వేసిన దానితో కలిపి మొత్తం మూడు అభియోగపత్రాలు వేసినట్టైంది. మనీ ట్రయల్ వివరాలు ఇందులో పొందుపరిచినట్లు సమాచారం.
ఈ కేసులో సిట్ ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. 31వ నిందితుడిగా ధనుంజయరెడ్డి, 32వ నిందితుడిగా కృష్ణమోహన్రెడ్డి, 33వ నిందితుడిగా బాలాజీ గోవిందప్ప, 30వ నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ బెయిల్పై బయటకొచ్చారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్నాయుడు సహా మొత్తం 8 మంది జైల్లో ఉన్నారు. వీరిలో నలుగురిపై సిట్ తాజాగా అభియోగపత్రం వేసింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ రెండు చార్జీషీట్లను దాఖలు చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: