కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెంగళూరు గ్రామీణ జిల్లా హోసకోటె తాలూకా గోనకనహళ్లి గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన అందరినీ కలిచివేసింది.స్థానిక సమాచారం ప్రకారం, శివకుమార్ (32), మంజుల (30) దంపతులు చాలాకాలంగా అప్పుల బారిన పడ్డారని చెబుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక వారు రెండు అమాయక ప్రాణాలను బలి చేశారు.ముందుగా తమ 11 ఏళ్ల కుమార్తె చంద్రకళ, 7 ఏళ్ల కుమారుడు ఉదయ్‌సూర్యను గొంతు నులిమి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
అనంతరం శివకుమార్, మంజుల ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే ఆ ప్రయత్నంలో శివకుమార్ (Sivakumar) మృతిచెందగా, మంజుల గాయాలతో బయటపడింది. మంజులను స్థానికులు, పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూలి పనులు చేసుకుని జీవించే శివు కొంతకాలం కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం
దీంతో ఆయనకు ఏ పనీ చేత కావడం లేదు. కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పాటు ఇంట్లో నిత్యం భార్య భర్తల మధ్య అనుమానంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెంది కుటుంబం (family) మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం. అలా అనుకున్న వెంటనే ఆదివారం మధ్యాహ్నం దంపతులు మొదట ఇద్దరు పిల్లలను చున్నీతో గొంతుకు బిగించి ప్రాణాలు తీశారు, ఆ తరువాత భార్యభర్తలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో భర్త చనిపోగా, తాడు తెగిపోవడంతో మంజుళ కిందపడి బతికింది.
దీంతో భర్త ఫోన్ తీసుకుని తన తండ్రికి కాల్ చేయాలనుకుంది, ఫోన్ లాక్ తెలియకపోవడంతో, పక్కింటికి వెళ్లి ఫోన్ తీసుకుని జరిగింది చెప్పింది, తాను మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి తెలిపింది. ఇదంతా వింటున్న పక్కింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన గురించి శివు సోదరి హోసకోటె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అనుమానంతో పోలీసులు మంజుళను విచారిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: