సామాన్యులకు అందని స్థాయిలో
పసిడి ధర గత రెండు దశాబ్దాలుగా పగ్గాలు లేకుండా గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. సామాన్యులకు అందుబాటులో లేకుండా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మన దేశంలో శుభకార్యాలకు, పెట్టుబడులకు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
రాబోయే రెండేళ్లలో పెరుగుదల అంచనాలు
రాబోయే రెండేళ్లలో బంగారం(Gold) ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బంగారు విపణి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలను చూపిస్తోంది. ఈ తరుణంలో బంగారంపై పెట్టుబడులు మాత్రమే సురక్షితమైన మార్గంగా పేర్కొంటున్నారు.
ముఖ్యంగా ప్రపంచంలో అనేక బ్యాంకులు బంగారం కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. చివరకు అమెరికాలోని బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ప్రభుత్వం జారీ చేసే బాండ్ల కన్నా బంగారం నిల్వలను పెంచుకోవడమే శ్రేయస్కర మార్గంగా వ్యవహరిస్తున్నాయి. దీనితో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

బంగారం ధరల చరిత్రాత్మక మార్పులు
2000వ సం॥లో కేవలం 4,400 రూపాయలుగా ఉన్న తులం (పది గ్రాములు) ధర 2005 నుంచి ఒక్కసారిగా పెరుగుదలను సూచిస్తూ వచ్చింది. 2006లో ఏడు వేల రూపాయల నుంచి కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఒక్కసారిగా 26 వేల రూపాయలకు ఎగబాకింది. 2015 వరకు సాధారణమైన పెరుగుదల చూపించినప్పటికీ 2020లో ఏకంగా 48 వేల రూపాయలకు చేరింది. 2024 వచ్చే సరికి 75 వేల రూపాయలకు చేరింది.
ఇక 2025లో మరింతగా పెరుగుతూ వచ్చి లక్ష రూపాయల మార్కును దాటింది. ఈ సంవత్సరం చివరి నాటికి లక్షా 20 వేల వరకు పెరిగే అవకాశం ఉందిన నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల డిమాండ్ పెరుగుదల కలసి బంగారాన్ని చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి తీసుకువెళ్లగలవని అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం రాబోయే రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు ఇప్పుడున్న ధరపై గరిష్టంగా మరో 50 శాతం పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది.
why is gold price rising: అంతర్జాతీయ విపణిలో బంగారాన్ని ఔన్సులతో కొలుస్తారు. ఔన్సు ధర సుమారు 5 వేల డాలర్లుగా అంచనా వేస్తే మన భారతీయ కరెన్సీలో పది గ్రాములు దాదాపుగా లక్షా 55 వేల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే ద్రవ్యపరపతి నిర్ణయాలుగా పేర్కొంటున్నారు. యుఎస్ ట్రెజరీ హోల్డింగ్లలో పెట్టుబడి కేవలం ఒక్క శాతం బంగారంలోకి మారినా 5 వేల డాలర్లను చేరుకుంటుందని చెబుతున్నారు.
పెట్టుబడిదారుల వైఖరి
ఆర్థిక పరమైన సమస్యలు, భయాలు కలిగినప్పుడు పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం(Gold) వాటాను పెంచుతున్నాయి. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలను వైవిధ్యీకరించి.. బంగారంలో నిధులను పెంచుతున్నారు. ఈ ట్రెండ్ బంగారం ధరలకు అదనపు మద్దతు ఇస్తోంది.

మార్కెట్ ఒత్తిడి & స్వల్ప తగ్గుదల
ప్రస్తుతం మార్కెట్లో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఇటీవల రికార్డు స్థాయిలను చేరుకున్న బంగారం ధరలు 1 శాతానికి పైగా వెనక్కి తగ్గాయి. ర్యాలీ తర్వాత లాభాలను బుక్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తు న్నారు. అయినప్పటికీ గోల్డ్మన్ సాచ్స్ అంచనాలు బంగారం మార్కెట్ భవిష్యత్తును అత్యంత బలంగా చూపుతున్నాయి. బాండ్లు, భూములు, ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారంపై పెట్టుబడి అత్యంత సురక్షితమైన అంశంగా పేర్కొంటున్నారు.
why is gold price rising: బంగారం కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా ఎటువంటి నిబంధనలు, డాక్యుమెంట్లు అవసరం ఉండవు. కేవలం కొన్ని నిమిషాలలోనే బంగారం క్రయ విక్రయాలు జరుగు తాయి. బంగారం నాణ్యత పరీక్షించడానికి అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఎటువంటి మోసం లేకుండా లావాదేవీలు జరుగుతాయి. ఇవి అతి పెద్ద బ్యాంకులతో పాటు సామాన్యులకు సైతం ఎంతో అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి.
భారతదేశంలో జాతీయ బ్యాంకులతో పాటు కేవలం బంగారంతో లావాదేవీలు నిర్వహించే అనేక ప్రైవేటు ఆర్థిక సంస్థలు ఉన్నాయి. దీనితో ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో పని పూర్తయి డబ్బు చేతికి వస్తోంది. దీనితో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సైతం బంగారం కొనుగోలు విషయంలో ఒక స్పష్టతతో ఉంటున్నారు. ఇక బ్యాంకులు సైతం ఆర్థిక సమస్యలను ఎదురు కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా బంగారం నిల్వలను పెంచుకోవడం చక్కటి భరోసాగా పేర్కొంటున్నారు.
Read Also: