Sale: ఫ్లిప్ కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్ తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐఫోన్ ధరలు బాగా తగ్గనున్నాయి. రూ.1,19,900 కు లాంచ్ అయిన ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, ఈ సేల్ సమయంలో రూ.69,999కు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్డ్ లో ప్రస్తుతం దీని ధర 1,12,900 జాబితా నుండి బాగా తగ్గింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈనెల 23న ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకు అందుబాటులో ఉంటాయి. మునుపటి సంవత్సరాల ఆధారంగా, డిస్కౌంట్ (Discount)చేయబడిన ఐఫోన్లు త్వరగా అమ్ముడవుతాయని భావిస్తున్నారు. కొన్నిసార్లు అమ్మకం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఇవి భారీగా సేల్ అయ్యాయి.
డిస్కౌంట్ ధరల్లో మార్పులుంటాయి ప్రభావవంతమైన డిస్కౌంట్ ఖచ్చితమైన వివరణను ఫిప్ కార్డ్ (Flip card)వెల్లడించలేదు. అయితే ఇందులో ఫ్లాట్ ధర తగ్గింపులు, బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ఐఫోన్ 16 ప్రోను ఐఫోన్ 17 కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నది.

Model Launch price Current listing price Sale price (effective)
iPhone 16 Pro Rs 1,19,900 Rs 1,12,900 Rs 69,999
iPhone 16 Pro Max Rs 1,44,900 Rs 1,39,900 Rs 89,999
iPhone 16 Rs 79,900 Rs 76,900 Rs 51,999
iPhone 14 Rs 69,900 Rs 59,900 Rs 39,999
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిల్లియన్ డేస్ (BBD) సేల్ ఎప్పుడు జరుగుతోంది?
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిల్లియన్ డేస్ సేల్ ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో నిర్వహించబడుతుంది, ఇందులో ప్రముఖ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.
ఈ సేల్‌లో ఏ బ్రాండ్ల ఉత్పత్తులు ఎక్కువ డిస్కౌంట్ పొందుతున్నాయి?
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ వంటి విభాగాల్లో ప్రముఖ బ్రాండ్లకు భారీ తగ్గింపులు లభిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: