ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఎప్పటిలాగే రెండు జట్ల మధ్య హై వోల్టేజ్ (High voltage) పోరు చోటుచేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా, పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేస్తూ ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. ఫలితంగా పాకిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.
చిన్న లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన భారత బ్యాటర్లు ఆత్మవిశ్వాసంగా ఆడి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఓపెనర్లు వేగంగా రన్‌లు సాధించగా, మధ్యలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, శివం దూబేలు దూకుడుగా ఆడుతూ జట్టును గెలుపు వైపు నడిపించారు. ఈ విజయంతో టీమిండియా (Team India) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీ ఫైనల్ అవకాశాలను బలపరుచుకుంది. అభిమానులు సోషల్ మీడియాలో ఆటగాళ్లను ప్రశంసిస్తూ మెసేజ్‌లు షేర్ చేశారు.
గెలుపు సాధించిన తర్వాత
అయితే మ్యాచ్ అనంతరం ఒక చిన్న వివాదం చెలరేగింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుని స్ఫోర్టివ్‌గా గౌరవం తెలియజేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. గెలుపు సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివం దూబే సహా భారత ఆటగాళ్లలో ఎవరూ కూడా పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయలేదు. దీంతో పాకిస్థాన్ జట్టు (Pakistan team) సైలెంట్‌గా మైదానాన్ని విడిచిపెట్టింది. ఈ సంఘటనను అక్కడున్న ప్రేక్షకులు, మీడియా కెమెరాలు రికార్డ్ చేశాయి.
పహల్గాం దాడిలో అమరులైన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం
ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఒక కీలక ప్రకటన చేశారు.గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్‌లో గెలుపు మాత్రమే కాదని.. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో అమరులైన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా.. భారత సాయుధ బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) కు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నామని పేర్కొన్నారు. దేశానికి ఎల్లప్పుడూ గర్వకారణంగా ఉండేలా జట్టు కృషి చేస్తుందని గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి కన్నా దేశభక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమైంది. ఈ విజయం భారత జట్టుకు సూపర్ 4లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: