Nirmala Sitharaman-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజల రోజువారీ జీవితంలో జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఉదయం తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు జీఎస్టీ సంస్కరణల ఫలితాలు వినియోగదారులకు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పులు సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు.

పన్ను శ్లాబుల మార్పులు, ప్రజలకు ఉపశమనం
మునుపటి 12% పన్ను పరిధిలో ఉన్న 99% వస్తువులు ఇప్పుడు కేవలం 5% కేటగిరీలోకి వచ్చినట్లు సీతారామన్ వెల్లడించారు. దీని వల్ల అనేక నిత్యావసర వస్తువులు(Essential goods) మరింత చౌకగా లభిస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో మార్కెట్లో ధరల భారమూ తగ్గి, వినియోగదారులకు ప్రత్యక్ష లాభం చేకూరుతోందని ఆమె పేర్కొన్నారు.
జీఎస్టీ వసూళ్లు పెరుగుదల, వ్యాపారాల విస్తరణ
గత ఎనిమిదేళ్లలో జీఎస్టీ పరిధిలోకి వచ్చిన వ్యాపారాల సంఖ్య 66 లక్షల నుంచి 1.5 కోట్లకు పెరిగిందని గణాంకాలతో వివరించారు. పన్ను విధానం పారదర్శకంగా మారడంతో తయారీదారులు, పంపిణీదారులు కూడా వ్యవస్థలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చారని అన్నారు. 2018లో రూ. 7.18 లక్షల కోట్లు ఉన్న జీఎస్టీ(GST) వసూళ్లు ప్రస్తుతం రూ. 22.08 లక్షల కోట్లకు పెరిగాయని వెల్లడించారు. ఈ పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లాభదాయకమైందని సీతారామన్ తెలిపారు.
జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం కలిగింది?
జీఎస్టీ పన్ను శ్లాబులు తగ్గించడంతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగింది.
వ్యాపారాల సంఖ్య ఎంత మేర పెరిగింది?
జీఎస్టీ అమలు తర్వాత వ్యాపారాల సంఖ్య 66 లక్షల నుంచి 1.5 కోట్లకు పెరిగింది.
Read hindi News: Hindi.vaartha.com
Read also: