తెలంగాణ ప్రభుత్వం పిల్లల భద్రత, మహిళల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఈ క్రమంలోనే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka)చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘మాసూమ్ సమ్మిట్’ 10వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.మంత్రి మాట్లాడుతూ – పిల్లల భద్రత (Child safety) అంటే సమాజ భవిష్యత్తు భద్రత అని స్పష్టం చేశారు.
చిన్నారుల హక్కులు, వారి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. చిన్న వయసులో ఎదురైన అనుభవాలు, మనసులో నాటుకుపోయే భావనలు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని అన్నారు. ఒక చిన్నారి గాయపడితే ఆ మచ్చ జీవితాంతం వెంటాడుతుందని, కాబట్టి వారికి స్వేచ్ఛగా, భయపడకుండా, ధైర్యంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆమె సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదస్సు నిర్వహించనుందని
ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సదస్సు నిర్వహించనుందని సీతక్క వెల్లడించారు. మహిళా భద్రత, పిల్లల రక్షణ అంశాలపై మేధావులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని తెలిపారు. ఆ సూచనలను ఆధారంగా తీసుకుని కొత్త మహిళా భద్రతా విధానం (New Women Security Policy) రూపుదిద్దనుందని ఆమె పేర్కొన్నారు.రాష్ట్రంలోని చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహిస్తుందని వెల్లడించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) చదువుతున్న పిల్లలకు మరింత పౌష్టికాహారం అందించేందుకు పరిశోధనలు చేసి మెనూలో మార్పులు చేసినట్లు మంత్రి సీతక్క వివరించారు. లైంగిక నేరాల నివారణకు కేవలం చట్టపరమైన శిక్షలు మాత్రమే కాకుండా.. ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా అవసరమని సీతక్క గుర్తు చేశారు. సమాజంలో ఆడవారిని ఎలా గౌరవించాలో స్కూల్‌లలోనే నేర్పాలని ఆమె సూచించారు.

డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు
ఇళ్లు, పాఠశాలలు, గ్రామాల్లో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ వంటి అంశాలపై చర్చ జరగాలని.. పిల్లలు ధైర్యంగా తమ మనసులో ఉన్న మాటలను మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.అలాగే రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు.. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీస్ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడం ద్వారానే రాష్ట్రంలో చిన్నారుల భద్రతను మరింత పెంపొందించవచ్చని మంత్రి సీతక్క వెల్లడించారు.మహిళల ప్రగతితోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని బాబా సాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) చెప్పిన మాటలు నిజమని తెలిపారు. స్కూళ్లలోనే అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అందిస్తున్నామని వివరించారు. గత 10 ఏళ్లుగా మాసూమ్ సమ్మిట్ (Masoom Summit) చేస్తున్న కృషిని అభినందించిన మంత్రి సీతక్క.. ప్రభుత్వం అందరితో కలిసి పనిచేసి.. ప్రతి చిన్నారి సమాజంలో భయపడకుండా జీవించే వాతావరణాన్ని కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
Read hindi news: epaper.vaartha.com
Read Also: