हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Ritika Nayak – అల్లు అర్జున్‌ తో నటించాలని ఉంది: మిరాయ్ హీరోయిన్

Anusha
Latest News: Ritika Nayak – అల్లు అర్జున్‌ తో నటించాలని ఉంది: మిరాయ్ హీరోయిన్

టాలీవుడ్‌ (Tollywood) లో తరచూ కొత్త కొత్త ముఖాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అలా ఇటీవలే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఒక నటి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ బ్యూటీ రితికా నాయక్ ( Ritika Nayak ) మొదట విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంది.

ఇప్పుడేమో రితికా కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా మిరాయ్ (Mirai Movie). యువ హీరో తేజా సజ్జా (Teja Sajja) నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ (Fantasy adventure movie) శుక్రవారం విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రితికా ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సినిమాలో హీరోతో రొమాన్స్ చేసే అవకాశం లేకపోయినా, తన పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఆమె విజయవంతమైంది.

వైబ్ ఉంది బేబీ పాట

ప్రత్యేకంగా, యూట్యూబ్‌ (YouTube) లో ముందే వైరల్ అయిన వైబ్ ఉంది బేబీ పాట సినిమా నుండి తొలగించబడటంతో రితికా అభిమానులు కొంత నిరాశ చెందారు. అయినా, ఆమె నటనపై వస్తున్న స్పందనలు మాత్రం పూర్తిగా పాజిటివ్‌గా ఉన్నాయి. అందుకే పరిశ్రమలో ఆమెకు వరుస ఆఫర్లు రావడం ఖాయం అని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.ఇక భవిష్యత్తులో రితికా ప్రాజెక్టులు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె వరుణ్ తేజ్ సరసన ఓ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది.

కొరియన్ హారర్ జానర్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ (Varun Tej)కెరీర్‌లో 15వ సినిమా కావడం విశేషం. అలాగే, ఆమె ఒక తమిళ బైలింగ్యువల్ మూవీలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అంటే, రితికా కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేయాలని ఉందట. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.నాకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం. నేను ఆయన ఫ్యాన్‌ని.

Ritika Nayak
Ritika Nayak

చిన్న పాత్ర అయినా సరే

తనతో నటించాలని ఎంతో ఆశగా ఉంది. అది హీరోయిన్‌గా అయినా సరే.. చిన్న పాత్ర అయినా సరే. బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా కోరిక. అలాంటి అవకాశమొస్తే అస్సలు వదులుకోను’ అంటూ తన మనసులోని మాట బయటపెట్టేసింది ఈ బ్యూటీ. దీంతో అప్పుడే నెటిజన్లు బన్నీ, రితికా కాంబోని ఊహించేసుకుంటూ పోస్టులు పెట్టేస్తున్నారు.

‘మిరాయ్’ బ్లాక్‌బస్టర్ హిట్‌ని ఖాతాలో వేసుకున్న రితికా అందంతో పాటు అభినయంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. అసలు ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) లో ఈమెను చూసి చాలామంది అచ్చ తెలుగు అమ్మాయేమో అని అనుకున్నారు. తన చిలిపితనం, అల్లరితో ఆ చిత్రంలో అంతలా ఆకట్టుకుంది. ‘మిరాయ్’ హిట్‌లో లక్కీ హీరోయిన్‌గా మారడంతో త్వరలోనే ఆమె కోరిక నెరవేరవచ్చని కొందరు అంటున్నారు. మొత్తంమీద ఈ బ్యూటీ పెద్ద ప్లానింగ్ మీదే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/aamir-khans-son-sai-pallavi-makers-change-the-title-of-the-movie/cinema/546747/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870