బెల్లంపల్లి మండలం (Bellampalli Mandal) లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. జీవితంలో మంచి భవిష్యత్తు ఉన్న ఓ బాలిక, అర్థంకాని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను షాక్‌కు గురి చేసింది.అకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గే రమేశ్, రాజక్క దంపతులు కూలిపనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ముగ్గురు కుమార్తెలలో రెండో సంతానం అయిన సుప్రియ (Supriya), (14) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు తాగేసింది
తెలివైన విద్యార్థిని అయిన సుప్రియ తన చదువులోనూ, ప్రవర్తనలోనూ అందరికి ఆదర్శంగా నిలిచేది.కానీ శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన ఒక్కసారిగా కుటుంబాన్నీ షాక్ కు గురి చేసింది.ఉదయం 4 గంటల సమయంలో సుప్రియ ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి ఎలుకల మందు (Rat Medicine) తాగేసింది. కొద్ది సేపటికి ఆమెకు అస్వస్థత కలగడంతో, కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ సుప్రియ మృతి
వారు ఆందోళనతో వెంటనే ఆమెను ఆటోలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) కి తరలించారు.అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల (Mancherial) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది. గత మూడు రోజులుగా సుప్రియ బడికి వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తమకు తెలియవని వారు కన్నీరుమున్నీరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: