గుంటూరు : 2027 నాటికి కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేసి వైద్య విద్యను యువతకు అందించే లక్ష్యం తో పీ3 మోడల్‌ను అనుసరిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మెడికల్ కాలేజీల నిర్మాణంపై జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “ఫుల్ టైమ్ బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని, పార్ట్ టైమ్‌గా తాడేపల్లికి వచ్చి రాష్ట్రంపై బురద జల్లే జగన్‌కు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. లండన్ మెడిసిన్ మానేసి మెడికల్ కళాశాలల నిర్మాణంపై ఏదేదో మాట్లాడుతున్నారని, ప్రజలను భయపెట్టి రాజకీయ లాభం పొందడమే జగన్ లక్ష్యం” అని స్పష్టం చేశారు.
జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా
17 మెడికల్ కాలేజీలు కట్టాం అని అబద్ధాలు అల్లుతున్న జగన్ రెడ్డి వాస్తవానికి శంకుస్థాపన రాళ్లు, బోర్డులు తప్ప జగన్ కట్టానని చెప్తున్న 17 మెడికల్ కాలేజీల్లో మరేమి లేవు. 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి అయ్యే రూ.8,500 కోట్లలో ఐదేళ్లలో జగన్ ఖర్చు పెట్టింది కేవలం 1,450 కోట్లు మాత్రమే. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను చూసి ప్రజలు ఆహా అంటున్నారు అని వైసీపీ నేతలు అనడం హాస్యాస్పదం అన్నారు. మదనపల్లి, మార్కాపురం, బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, మచిలీపట్నం, ఏలూరు ఇలా ఎక్కడ చూసినా జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీ (medical college) లు అంటే మసిపూసిన మారేడుకాయలే.అని అన్నారు. ఈ కాలేజీల్లో బోర్డును చూసి జనం ఆహా అనుకుంటున్నారు.

మెడికల్ కాలేజీలు నిర్మించడం అయిపోదు
వీటన్నింటిలో జగన్ ఏదైనా పర్ఫెక్ట్ గా కట్టింది మాత్రం శిలాఫలకాలే. ఎటువంటి మోలిక సదుపాయాలు అభివృద్ధి చేయలేదన్నారు. పునాదులకే మెడికల్ కాలేజీలను పరిమితం చేశారన్నారు. తరగతి గదులు, ల్యాబ్‌లు, బోధన సిబ్బందులు ఇలా ఏమి లేకుండా కేవలం బోర్డులు పెడితే మెడికల్ కాలేజీలు నిర్మించడం అయిపోదు.. అవి పూర్తి చేసి యువతకు వైద్య విద్య (Medical education) ను అందించాలి. జగన్ హయాంలో కట్టానంటున్న మెడికల్ కాలేజీల పరిశీలనకు 2024 జూన్‌లో వచ్చిన విలీది ప్రతినిధులు తన ఆహా కట్టడాలు చూసి సీట్లు ఇవ్వడానికి నిరాకరించింది. మీరు చేసిన పాపానికి నేడు యువతకు వైద్య విద్య దూరం అయ్యింది” అని మండిపడ్డారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి
పీపీపీ అంటే జగన్ ప్రైవేట్ పార్టనర్షిప్ కాదు పీపీపీ మోడలను జగన్ తప్పుగా చిత్రీకరిస్తూ ప్రజల్లో భయం పుట్టిస్తున్నారన్నారు. పీపీపీ విధానం అంటే జగన్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. పీపీపీ విధానంలో కళాశాల యాజమాన్య హక్కులు అంతా ప్రభుత్వానిదే అని అన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతాయన్నారు. జీరో ప్రాఫిట్‌తో ప్రైవేట్ సంస్థలు ఈ కళాశాలలను అభివృద్ధి చేస్తాయని, 33 సంవత్సరాల తర్వాత మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అధీనంలోకి వస్తాయని, కానీ జగన్ మాత్రం పుకార్ల వ్యాపారం చేస్తున్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: