మంత్రి నారాయణ
విజయవాడ : రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగింది. ముందుగా మహాత్మాగాంధీ. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిధిగా హజరైన మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా మార్చాలంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని, ఎవరికి వారు తమ ఇంటిని, పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రమంతా స్వచ్ఛత నెలకొంటుందని అన్నారు.
మున్సిపాలిటీల్లో వచ్చిన ఆదాయంలో సగం
రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీల్లో ముందుగా స్వచ్ఛమైన తాగునీరు (drinking water), సాలిడ్, లిక్వీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, లైట్లు, రోడ్లు ఇలా 18 రకాల సేవలు అవస రమని, ప్రజలు అందరికీ ఈ సేవలను అందించడానికి సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీల్లో వచ్చిన ఆదాయంలో సగం గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందని,
అయినా దార్శనికుడైన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో ప్రజలకు సుపరిపాలన అందించగలు గుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగిందని, అప్పటికే గత ప్రభుత్వం వదిలివెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగిందన్నారు.
లక్ష్యన్ని నూరు శాతం చేరుకుంటామన్నారు
అంత పెద్ద మొత్తంలో చెత్తను క్లియర్ చేయడానికి కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని, కాని స్వచ్ఛ ఆంధ్ర కార్పొ రేషన్ చైర్మన్, ఎండీల సహకారంతో ఇప్పటికే 81 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని వివరించారు. మరో 20 రోజుల్లో మొత్తం చెత్త (Garbage) ను క్లియర్ చేసి అక్టోబర్ 2 నాటికి లక్ష్యన్ని నూరు శాతం చేరుకుంటామన్నారు. జపాన్, రష్యా, చైనా, ఇలా నేను ఏ దేశం వెళ్లినా మొదట సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణను పరిశీలిస్తానని తెలిపారు.
ఆయా దేశాలు అమలు చేస్తున్న చెత్త నిర్వహణపై అమలు చేస్తున్న విధానాలు ఇక్కడ కూడా అమలు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. అందులో భాగమే రాష్ట్రంలో పెద్ద నగరాల్లో డంపింగ్ యార్డులు లేకుండ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి చెత్తను బర్న్ చేసి విద్యుత్ ను ఉత్పత్తి చేయగలుగుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు.

చెత్త నుండి సంపద సృష్టి
అమృత స్కీం టెండర్లను త్వరలో పిలవనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర డైరక్టర్లు తమ శక్తి మేర పనిచేయాలని, నూతన డైరక్టర్లు వారి ప్రాంతాల్లో వేస్ట్ మేనేజ్ మెంట్పై దృష్టి సారించాలని, చెత్త నుండి సంపద సృష్టి పై అవగా హన పెంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్త మీద సైతం పన్ను వేసిందని,
కాని కూటమి ప్రభుత్వం చెత్త పన్ను తొలగించి ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికే ఉందని నిరూపించిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, మంత్రి నారాయణ కృషితో దేశం లోనే అత్యంత ఉత్తమ నగరాలుగా మన రాష్ట్రంలోని ఐదు నగరాలు టాప్ లో నిలిచాయన్నారు. దీంతో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
తాను సైతం స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని
నేపాల్లో చిక్కుకున్న మన రాష్ట్ర పౌరులను 48 గంటలపాటు శ్రమించి మన రాష్ట్రానికి విజయవంతంగా తీసుకురాగలగటంలో మంత్రి లోకేష్ (Minister Lokesh) చేసిన కృషి మహోన్నతమైనదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్రకు పెద్దపీట వేస్తూ తాను సైతం స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిడమే కాకుండ కార్యక్రమం విజయవంతం చేయడంలో చూపుతున్న శ్రద్ధ ఎనలేనిదని కొనియాడారు.
స్వచ్ఛ ఆంధ్ర సాధనలో అందరం ఒక కుటుంబంలా టీమ్ వర్క్ చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో పనిచేస్తాడని, ఆయన ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.
స్వచ్ఛతా కార్యక్రమాలు
స్వచ్ఛత అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛతా హీ సేవా అనే కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్నామన్నారు.
దీనిలో భాగంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించనున్నామని, అలాగే ఈ నెల 25న ఎక్ దిన్, ఎక్ ఘంటా, ఎక్ సాత్ అనే కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని కోరారు. అదేవిధంగా అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివాసు పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: