ప్రముఖ నటి, నిర్మాత అయిన రేణూ దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు. మహిళలపై సమాజంలో నెలకొన్న పితృస్వామ్య ధోరణిని తీవ్రంగా ప్రశ్నిస్తూ ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
“పవన్ భార్యగానే మిమ్మల్ని చూస్తాం” – అభిమాని కామెంట్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూదేశాయ్(Renu Desai)కు ఇటీవల ఓ అభిమాని, “మిమ్మల్ని మేము ఇంకా పవన్ కల్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో ఇంకెవ్వరినీ ఊహించలేం” అంటూ వ్యాఖ్య చేశాడు. ఈ కామెంట్ తనను తీవ్రంగా బాధించిందని ఆమె తెలిపారు. అంతే కాకుండా, ఆ స్క్రీన్‌షాట్‌ను కూడా తన పోస్ట్‌లో షేర్ చేశారు.
పితృస్వామ్య ధోరణిపై తీవ్ర విమర్శ
ఈ నేపథ్యంలో, రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసిన సుదీర్ఘ పోస్ట్‌లో,
“ఇప్పటికీ మహిళల్ని ఒకరి ఆస్తిగా చూడటం ఆపలేదు. ఇది ఎంతో బాధాకరం.చదువుకున్నవాళ్లలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉండటం శోచనీయం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.2025లో ఉన్నా కూడా, మహిళలకు తమ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడం (Lack of freedom)దురదృష్టకరమన్నారు.
స్త్రీలను ‘పదవిగా’ పరిగణించే భావనకు వ్యతిరేకంగా
స్త్రీలు తండ్రి లేదా భర్తల ఆధీనంలో ఉండాలన్న భావన ఇప్పటికీ సమాజంలో ఉండటం నిజంగా విషాదకరం అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. చదువు, ఉద్యోగం వంటి ప్రాధమిక విషయాలకైనా మహిళలు ‘అనుమతి’ కోరాల్సి వస్తుండటం బాధాకరమన్నారు.
“ఫెమినిజం అంటే స్వేచ్ఛ.. మానవత్వం”
రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో,
“ఫెమినిజం అంటే వారం చివరలో తాగడం కాదు. అసలు ఫెమినిజం అంటే మహిళల్ని పశువులు లేదా ఫర్నిచర్‌లా చూసే మైండ్‌సెట్‌ను ప్రశ్నించడమే” అని చెప్పారు. భవిష్యత్ తరాల్లో అయినా మహిళలు గౌరవంతో బ్రతికే స్వాతంత్ర్యం కలిగి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
రాబోయే తరాల కోసం మార్పు అవసరం
స్త్రీలను గర్భంలోనే చిదిమేయడం, పరువు హత్యలు, వరకట్న మరణాలు లాంటి దురాచారాలు కొనసాగడం ఆగాలని ఆమె ఆశించారు.ఈ సమస్యలను ఎదుర్కొనటానికి తానే కాదు, ప్రతి మహిళ తన స్వరాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు.
రేణూ దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లపై విస్తృత చర్చకు దారితీసింది.
నెటిజన్ ఏమన్నాడు? రేణూ ఎందుకు ఆగ్రహించారు?
ఓ అభిమాని, “మిమ్మల్ని మేము పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తాం. మీ జీవితంలో ఇంకొకరిని ఊహించలేం” అన్నాడు. దీనిపై రేణూ స్పందిస్తూ, ఇది ఒకరిని ఆస్తిగా పరిగణించే దారుణమైన పితృస్వామ్య ఆలోచన అని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: