హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతాల్లో భారీ వర్షం(Rain) కురిసింది. మధ్యాహ్నం నుంచి నగరంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన చీకటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో (areas) ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరో నాలుగు రోజులు వర్షాలు
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, (Hayat Nagar) అబ్దుల్లాపూర్‌మెట్ వంటి శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. అలాగే, మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెదక్(Medak) పట్టణంలోని రోడ్లు జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా, నగరంలో ఉదయం నుంచి చినుకులు కురుస్తున్నా, కొన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షం పడింది.
హైదరాబాద్‌లో ఎక్కడ భారీ వర్షం కురిసింది?
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.
మెదక్ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది?
మెదక్ జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: