కావలసినవి :
- జీడిపప్పు – ముప్పావు కప్పు
- బాదం – ముప్పావు కప్పు
- పిస్తా – ముప్పావు కప్పు
- పప్పులు – రెండు చెంచాలు
- గుమ్మడి గింజలు – రెండు చెంచాలు
- నెయ్యి – చెంచా
- బెల్లం – కప్పు
- నీళ్లు – పావుకప్పు
- యాలకుల పొడి – చిటికెడు

తయారీ విధానం :
పాన్లో బాదం, పిస్తా, జీడిపప్పులు, గుమ్మడి గింజలు వేసి పది నిమిషాలు దోరగా కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం, పావుకప్పు నీళ్లు పోసి అది కరిగే వరకు బాగా కలపాలి. తరువాత పాన్లో నెయ్యి (ghee) వేసి వేడి చేసుకుని అందులో బెల్లం కలిపి ఐదారు నిమిషాల్లో పాకం సిద్ధం అవుతుంది. ఈ పాకాన్ని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు కరిగిపోకుండా గట్టిగా ఉంటే అది నొల్ పాకం అని అర్థం. ఇప్పుడు అందులో వేయించిన డ్రై నట్స్(Dry nuts) కొద్దిగా యాలకుల పొడి వేసి త్వరగా కలపాలి. వెంటనే నెయ్యి రాసిన పళ్లంలో ఈ మిశ్రమాన్ని వేసి, పైభాగంలో కూడా నెయ్యి రాసిన బటర్ పేపరు ఉంచి చపాతీ కర్రతో ఒత్తాలి. ఇలా చేస్తే చిక్కీలు సమానంగా వస్తాయి.

Read also: hindi.vaartha.com
Read also: