हिन्दी | Epaper

News Telugu: CP Radhakrishnan – మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణన్

Rajitha
News Telugu: CP Radhakrishnan – మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణన్

భారత రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) తన పదవికి రాజీనామా సమర్పించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు (శుక్రవారం) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుంది.

మహారాష్ట్ర గవర్నర్‌గా 13 నెలలు

తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ (CP Radhakrishnan) గత ఏడాది జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 13 నెలల కాలం ఆయన ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించారు. ఈ కాలాన్ని తన రాజకీయ జీవితంలో ఎంతో సంతృప్తికరంగా భావిస్తున్నానని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పరిపాలనాపరంగా, రాజకీయ పరంగా మహారాష్ట్ర తనకు అనేక అనుభవాలు నేర్పిందని ఆయన అన్నారు.

CP Radhakrishnan

CP Radhakrishnan

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ విజయ కేతనం ఎగరేశారు. మొత్తం 752 ఓట్లకు గాను ఆయనకు 452 ఓట్లు లభించాయి. విస్తృత మద్దతుతో ఎన్నికై దేశానికి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకోవడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది. తాత్కాలిక గవర్నర్‌గా (Governer) ఆచార్య దేవవ్రత్రా ధాకృష్ణన్ రాజీనామా తర్వాత మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలు తాత్కాలికంగా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అప్పగించబడ్డాయి. రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త గవర్నర్ నియామకం వరకు దేవవ్రత్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.మహారాష్ట్ర(Maharastra) రాజ్ భవన్‌లో రాధాకృష్ణన్‌కు ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజీపడని జాతీయవాదినని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన చెప్పారు.

కొత్త ప్రయాణానికి సిద్ధం

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్న రాధాకృష్ణన్ దేశ రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యసభ సభాపతిగా కూడా ఆయన పనిచేయాల్సి ఉంటుంది. శాసనసభలో చర్చలు సజావుగా నడిచేలా చూడటం, విభిన్న అభిప్రాయాల మధ్య సమన్వయం కల్పించడం వంటి బాధ్యతలు ఆయన భుజానికెక్కనున్నాయి. రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలలో CP రాధాకృష్ణన్ గెలుపొందారు దీనితో రేపు ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు.

Q1: సీపీ రాధాకృష్ణన్ ఎందుకు మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు?
A:
ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో కొత్త బాధ్యతలు స్వీకరించడానికి రాజీనామా చేశారు.

Q2: రాధాకృష్ణన్ ఎప్పుడు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు?
A:
శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం జరగనుంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/nara-lokesh-minister-nara-lokesh-responds-to-jagans-press-meet/andhra-pradesh/545045/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈశ్వర్ మరణంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ దే బాధ్యత

ఈశ్వర్ మరణంపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ దే బాధ్యత

పవన్‌కు పెద్ద అభిమానిని: పత్తిపాటి పుల్లారావు

పవన్‌కు పెద్ద అభిమానిని: పత్తిపాటి పుల్లారావు

చట్టం అందరికీ సమానం: మంత్రి పొంగులేటి

చట్టం అందరికీ సమానం: మంత్రి పొంగులేటి

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు

నన్ను ఎన్నుకున్నది అరిచేందుకు కాదు

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

తెలుగు చదువుకుంటేనే ఉద్యోగాలు ఇస్తామనాలి: వెంకయ్యనాయుడు

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన

అదనపు సిబ్బంది తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచన

📢 For Advertisement Booking: 98481 12870