Samsung Galaxy F17 5G : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ భారత మార్కెట్లో తన గెలాక్సీ ఎఫ్-సిరీస్‌ను విస్తరిస్తూ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ F17 5Gను (Samsung Galaxy F17 5G) విడుదల చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా పెట్టుకొని ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకొచ్చింది. ముఖ్యంగా, ఆరేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ హామీ ఇవ్వడం ఈ ఫోన్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ప్రధాన ఫీచర్లు
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ
- ప్రాసెసర్: శాంసంగ్ ఎక్సినాస్ 1330
- కెమెరా: 50MP ప్రధాన కెమెరా (OIS), 5MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో – ట్రిపుల్ కెమెరా సెట్‌అప్
- ఫ్రంట్ కెమెరా: 13MP
- బ్యాటరీ: 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ (బాక్స్‌లోనే ఛార్జర్)
- సాఫ్ట్‌వేర్: Android 15 ఆధారిత One UI 7
- Galaxy AI ఫీచర్లు: Circle to Search వంటి స్మార్ట్ ఫీచర్లు
ధర, లభ్యత
- 4GB RAM + 128GB స్టోరేజ్ – ₹14,499
- 6GB RAM + 128GB స్టోరేజ్ – ₹15,999
- కలర్స్: వయోలెట్ పాప్, నియో బ్లాక్
- అందుబాటులో: Flipkart, Samsung అధికారిక వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లు
- బ్యాంక్ ఆఫర్: ఎంపిక చేసిన కార్డులపై ₹500 క్యాష్‌బ్యాక్
శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెనన్ విజయ్ మాట్లాడుతూ,
“గెలాక్సీ F17 5G వినియోగదారులకు భవిష్యత్తుకు అవసరమైన ఆవిష్కరణలను అందించడమే కాకుండా, తన సెగ్మెంట్‌లో అత్యంత స్లిమ్, మన్నికైన ఫోన్‌గా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
Read also :