గత నాలుగురోజులుగా నేపాల్ లో కొనసాగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితులు చేజారిపోయింది. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ (Prime Minister KP Sharma Oli) తో సహా మంత్రులు రాజీనామా చేయడంతో పాటు కర్న్యూను అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరూ రావడం లేదు. దీంతో నేపాల్ లో ఆందోళనలు కాస్త సద్దుమనిగినట్లుగా అయ్యింది.
ఈ నేపధ్యంలో నేపాల్ లో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు జెన్ జెడ్ ముమ్మర చర్చలు జరుపుతోంది. నేపాల్ లో తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, కార్మొండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్ ఘీసింగ్ పేర్లు వినిపిస్తున్నాయి.
సుశీల కర్కివైపే యువత ఆసక్తి
సుశీల కర్కి (Sushila Karki) నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళ కావడం విశేషం. ఆమె వైపే యువత అంతా మొగ్గు చూపుతున్నట్లుగా,తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రేసులో తన వినిపిస్తుండడంతో కాట్మండు మేయర్ బాలేంద్ర షా ఇప్పుడు స్పందించారు. ‘ప్రియమైన జనరల్ జెడ్ యువతకు, అందరి నేపాలీలకు నా అభ్యర్థన.
దేశం ప్రస్తుతం అపూర్వమైన పరిస్థితిలో ఉంది. మీరు ఇప్పుడు బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు. దయచేసి ఈ సమయంలో భయపడవద్దు. అంతా ఓపికపట్టండి. దేశం తాత్కాలిక ప్రభుత్వాన్ని పొందబోతోంది. దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ పని ఎన్నికలు నిర్వహించడమే’ అని బాలేంద్రషా తెలిపారు.
పార్లమెంటును రద్దు చేయాల్సిందే
తాత్కాలిక/ఎన్నికల ప్రభుత్వానికి నాయకత్వం వహించాలనే మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి (Former Chief Justice Sushila Karki) ప్రతిపాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. మీ అవగాహన, జ్ఞానం, ఐక్యతను నేను హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను.
ఇది మీరు ఎంత పరిణతి చెందినవారో చూపిస్తుంది. ప్రస్తుతం నాయకత్వాన్ని చేపట్టడానికితొందరపడుతున్న నా స్నేహితులకు నేను చెప్పాలకుంటున్నది ఏమిటంటే, దేశానికి మీ అభిరుచి, మీ ఆలోచనల శాశ్వతంగా అవసరం దాని కోసం ఎన్నికలుఉంటాయి. ఆలస్యం చేయకుండా పార్లమెంటు రద్దు చేయాలి’ అని బాలేంద్ర షా తెలిపారు.
నడుస్తున్న విమాన సర్వీసులు
కాట్మండు కు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు భారత్ కు చెందిన విమానయాన సంస్థలు తెలిపాయి. అక్కడ చిక్కుకున్న భారతీయులను తిరిగివెనక్కి తీసుకొచ్చేందుకు ఎయిరిండియా, ఇండిగో సంస్థలు అదనపు విమానాలు నడపనున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రాంమ్మోహన్ నాయుడుతెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: