Kishkindhapuri Movie Review : కాస్ట్లీ సినిమాల హీరోగా పేరుగాంచిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘కిష్కింధపురి’ రేపు (సెప్టెంబర్ 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు. (Kishkindhapuri Movie Review) హారర్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ / AAA మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో నిర్వహించగా, చిత్రబృందంతో పాటు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. సినిమా చూసిన వారి టాక్ ప్రకారం –
- సినిమా వ్యవధి 2 గంటల 5 నిమిషాలు.
- దర్శకుడు అనవసర హంగులు లేకుండా, పాయింట్‌కి కట్టుబడి కథను బలంగా నడిపించాడు.
- ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో హారర్ ఎలిమెంట్స్ పీక్స్‌కి చేరుకున్నాయి.
- దెయ్యం పాత్రలో అనుపమ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
- తమిళ నటుడు శాండ పాత్ర, క్లైమాక్స్‌లో తెప్పించిన గూస్‌బమ్స్ ప్రత్యేక ఆకర్షణ.
- ముఖ్యంగా చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ‘పార్ట్ 2’ పై ఆసక్తిని పెంచింది.
సినిమాకి మరొక పెద్ద బలం ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. డాల్బీ అట్మాస్‌లో ఇచ్చిన సౌండింగ్ థియేటర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెబుతున్నారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో సౌండ్ కాస్త ఎక్కువగా ఉందని కూడా అభిప్రాయం.
మొత్తానికి చూస్తే, ‘కిష్కింధపురి’ భయపెట్టే హారర్, ఉత్కంఠ రేపే థ్రిల్లర్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉందని టాక్. బెల్లంకొండ ఫస్ట్ టైమ్ ఈ తరహా జానర్‌లో చేసిన ప్రయోగం హిట్ అవుతుందనే నమ్మకం పెరుగుతోంది.
Read also :