ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరోసారి బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. విజయవాడ(Vijayawada)లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇరువర్గాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పు
గత వారం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో, నిన్న సాయంత్రం న్యాయస్థానం తుది నిర్ణయం వెల్లడించింది. ప్రాసిక్యూషన్ వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కరరావు, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ న్యాయవాది వాదనలు
ప్రభుత్వ తరఫున న్యాయవాది జేడీ రాజేంద్రప్రసాద్ కోర్టులో చేసిన వాదనల ప్రకారం, చెవిరెడ్డి లిక్కర్ స్కాం(Liquor scam) లో కీలక పాత్ర పోషించారని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం సరఫరా చేయడానికి భారీగా డబ్బును YSRCP నేతలకు బదిలీ చేసినట్టు ఆరోపించారు.
తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం
చెవిరెడ్డి కు చెందిన సంస్థలపై S.I.T. అధికారులు ఇటీవల దాడులు నిర్వహించి, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున, బెయిల్ ఇవ్వడం విచారణకు అంతరాయం కలిగిస్తుందని న్యాయవాది వాదించారు. ఇది మొదటిసారి కాదు – చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ఇంతకుముందూ తిరస్కరించబడిన విషయం తెలిసిందే. ఈసారికి కూడా న్యాయస్థానం అదే నిర్ణయం తీసుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Read Also: