వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తాజాగా కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా లోకేష్, జగన్ ఆరోపణలు పూర్తిగా వాస్తవం లేని వాటిగా వ్యాఖ్యానించారు.
జగన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేదని లోకేష్ (Nara Lokesh) విమర్శించారు. ఆయన మాటల్లోనే గందరగోళం ఉందని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కనీసం తన సలహాదారులను అడగాలని సూచించారు. వైద్య రంగంలో పెట్టుబడులు రాబట్టేందుకు, కాలేజీలను అభివృద్ధి చేయడానికి పీపీపీ మోడల్‌నే మేము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరం
లోకేష్ మాట్లాడుతూ – వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని ((PPP) policy) అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వైద్య కళాశాలలకు వైసీపీ ప్రభుత్వం పునాదులైనా వేయలేదని, అన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ఒక్కటైనా నిజం మాట్లాడాలని సూచించారు. కొంతమందికి అవగాహన లేకపోతే, పీపీపీ గురించి పక్కనున్న సలహాదారులను అడిగి తెలుసుకోవాలని లోకేష్ అన్నారు.అంతలా మాట్లాడే వైసీపీ నాయకులు ఐదేళ్ల పాలనలో వైద్య కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

మా ప్రభుత్వ లక్ష్యం అన్నింటినీ పూర్తి చేయడం
“మా ప్రభుత్వ లక్ష్యం అన్నింటినీ పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం” అని ఆయన అన్నారు.పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు నుంచి మాట్లాడారా, విజయవాడ నుంచి అని లోకేష్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించగా, వారు విజయవాడ నుంచి అని సమాధానమిచ్చారు. ఓహో, బెంగళూరు నుంచి మాట్లాడారనుకున్నా అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: