తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తాజా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ రోజు నుండి వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.
ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వర్షపాతం హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని సూచన ఇచ్చింది.
ఎల్లో అలర్ట్
నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉంది.

ప్రజలు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రాబోయే మూడు రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం
బుధవారం హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉన్న ఉక్కపోతకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ప్రధానంగా తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, తార్నాక, ఎల్బీనగర్, పాతబస్తీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి వంటి ప్రాంతాలలో వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పలు రహదారులపై నీరు నిలిచిపోయింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి.చేవెళ్ల పట్టణ కేంద్రంలో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వరదలా మారింది. స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: