విజయ్ ఆంటోనీ అభిమానులకు సంతోషకరమైన వార్త. తెలుగు తెరపై బిచ్చగాడు మూవీతో పాపులరిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony), మార్గన్ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ కొత్త చిత్రం పేరు భద్రకాళి. సినిమా విశేషంగా రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ రకంలో తెరకెక్కుతున్నట్లు మేకర్స్ తెలిపారు.విజయ్ ఆంటోనీకి ఈ సినిమా కేరియర్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భద్రకాళి సినిమాను సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ (Sarvant Ram Creations Banner) పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో రాబోతుంది.
ట్రైలర్
రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Asian Suresh Entertainments) ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో దర్శకుడు అర్జున్ తెరకెక్కిస్తుండగా, తరతరాల పౌరుషం..తెగింపునకి వెనకాడదు అంటూ ఎన్నికలు, డబ్బు చుట్టూ పలు సంభాషణలు ఆసక్తిరేపుతున్నాయి.
ప్రస్తుతం ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతుంది.ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: