మెగా ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో ఘనమైన సంబరాలు నెలకొన్నాయి. అభిమానుల హృదయాలను మురిపిస్తున్న మరో శుభవార్త వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి (Varun Tej – Lavanya Tripathi) దంపతుల కుటుంబంలో జరిగింది. నేడు బుధవారం ఉదయం, హైదరాబాద్‌లోని ప్రముఖ రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ సందర్భం కుటుంబానికి మాత్రమే కాక, మెగా ఫ్యామిలీ అభిమానుల కోసం కూడా ప్రత్యేకమైన ఆనందం.సోషల్ మీడియా (Social media) లో ఈ శుభవార్త వెంటనే వైరల్ అయ్యింది. అభిమానులు వరుణ్ తేజ్ దంపతులకు,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మెగాఫ్యాన్స్ ఈ సందర్భాన్ని వ్యక్తిగతంగా తమకు ఆనందంగా భావిస్తున్నారు.
వరుణ్, లావణ్యలను స్వయంగా శుభాకాంక్షలు
అయితే, ఈ ఆనందకరమైన సందర్భంలో కుటుంబ సభ్యుల సాన్నిధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా ఫ్యామిలీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చిరంజీవి, ఈ శుభవార్త తెలుసుకున్న వెంటనే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరి, వరుణ్, లావణ్యలను స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన మనవడిని ఎత్తుకుని దిగిన ఫొటోని చిరు తాజాగా ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
చిరంజీవి (Chiranjeevi) తన మనవడి రాకపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. కొణిదెల కుటుంబంలోకి మరో వ్యక్తి వచ్చాడు. ఈ చిన్నారికి నూతన ప్రపంచంలోకి స్వాగతం. తాతయ్య, నానమ్మలుగా ప్రమోషన్ అయిన నాగబాబు, పద్మజలకు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ బుజ్జి వాడికి సంతోషం, మంచి ఆరోగ్యం, పుష్కలమైన ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. అంటూ తన మనవడిని ఎత్తుకున్న ఫొటోను చిరు షేర్ చేశాడు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: