France-ఫ్రాన్స్ రాజధాని పారిస్తో సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ‘బ్లాక్ ఎవ్రీథింగ్”(Black Everything‘) నినాదంతో ఆందోళనకారులు రోడ్లు, రైల్వే మార్గాలను దిగ్బంధించారు. దీంతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిరసనకారులు ట్రాఫిక్స్ సిగ్నల్స్ వద్ద వాహనాలను తగ్గులబెట్టడం, రహదారులపై అడ్డంకులు అడ్డంకులు సృష్టించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఇప్పటివరకు సుమూరు 200 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే నిరసనలకు కారణం
ఈ నిరసనలకు ప్రధాన కారణం కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకార్ను నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఆర్థిక సంస్కరణలే. పెన్షన్ల తగ్గింపు, పన్నుల పెంపు వంటి కఠినమైన విధానాలను ప్రభుత్వం అమలు చేయనుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఫాన్స్ లో నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త విధానాలు వారిపై మరింత భారాన్ని మోపుతాయని వారు భయపడుతున్నారు.

80వేల పోలీసు బలగాల మోహరింపు
పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రభుత్వం 80వేలమంది పోలీసు బలగాలను మోహరించింది. అనేకచోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనల్లో వందలాదిమంది ఆరెస్టు అయ్యారని, మరికొంతమంది గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు. నేపాల్ మాదిరిగానే అల్లర్లు కాగా గతమూడు రోజులు నేపాల్ లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది
సోషల్ మీడియాపై నిషేధం విధంచడంతో ఏర్పడ్డ గొడవలు
చిలికిచిలికి గాలివానలా మారింది. యువకులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పార్లమెంటు, ప్రధాని అధికార నివాస భవనాలకు నిప్పు పెట్టే యత్నం చేశారు. దీంతో నేపాల్ సైన్యం(Nepal Army) ప్రధాని ఓలిని తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. చేసేది లేక ప్రధాని ఓలి తన పదవికి రాజీనామా(Resignation) చేశారు. అయినా అక్కడ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ లో అల్లరు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. నిరసనకారులు రోడ్లపై వాహనాలను తగులపెట్టారు. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థను స్తంభింపచేశారు. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించి, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నది.
ఫ్రాన్స్‌లో నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, జీవన వ్యయాల పెరుగుదల, ఇంధన ధరల సమస్యల వల్ల ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
ఫ్రాన్స్ పరిస్థితి నేపాల్‌తో పోల్చబడటానికి కారణం ఏమిటి?
నిరసనలు, అశాంతి, రాజకీయ అస్థిరత వంటి అంశాలు నేపాల్‌లో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: