విజయవాడ: విజయవాడ నగరం పరిధిలో మరో భారీ ప్లైవోవరు అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గొల్లపూడి నుంచి పున్నమిఘాట్ వరకు భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎన్హెచ్ 65 రహదారి విస్తరణ గొల్లపూడి వరకు పరిమితం చేయకుండా భవానీపురంలోని పున్నమిఘాట్ వరకు కొత్తగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసే 4 కిలోమీటర్లు పొడవున పైవంతెన నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన.

ఇబ్రహీంపట్నంలోనూ ఓ పైవంతెన
దీంతో పాటు ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) లోనూ ఓ పైవంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రతిపాదనలరు ఎన్హెచ్ఎ ఆమోదం పొందితే నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరతాయి.బ్రహీంపట్నం ఊరిలో 1.3 కిలోమీటర్ల మేర మరో ప్లైఓవర్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కన్సల్టెన్సీ వారు ఎన్హెచ్ అధికారులకు ప్రతిపాదించారు. ఊరి ప్రారంభం నుంచి చివరి వరకు ఎటువంటి రహదారి ప్రమాదాలకు తావు లేకుండా ప్లైఓవర్ నిర్మించాలనే ఆలోచన చేసారు. హైదరాబాద్ వెళ్లేవారు, దుర్గగుడి, బస్టాండ్తో పాటు నగరంలోకి వచ్చే వారితో ఈ మార్గంలో ట్రాఫిక్ రోజురోజుకు రద్దీగా మారుతోంది. ప్రయాణికులు రోడ్డు మీదే ఇబ్బందులు పడరతున్నారు. దీనికి పరిష్కారంగా రహదారిని పున్నమిఘాట్ (Punnamighat) వరకు విస్తరించడమే భారీ ఊరట కలిగిస్తుంది. కాగా పైవంతెన కూడా నిర్మిస్తే నగరవాసులకు పెద్దవరం కాబోతోంది. ప్రతిపాదనల ప్రకారం గొల్లపూడి పశ్చిమ బైపాస్ దగ్గర ఈ పైవంతెన నిర్మాణం మొదలై దుర్గగుడి వంతెనలో కలుస్తుంది. ముందుగా అనుకున్న విధంగా రహదారి విస్తరణ చేపడితే గొల్లపూడి నుంచి భవానీపురం, ఇబ్రహీంపట్నం పరిధిలో ఆరు లైన్ల విస్తరణకు దాదాపు 150 ఎకరాలు అవసరం అవుతుంది. అయితే ఆయా ప్రాంతాల్లో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం ధర రూ.1030 కోట్లు ఉంది. భూసేకరణకు రూ.100ల కోట్లలో పరిహారం చెల్లించాలి. దారిపొడవునా ఉన్న దుకాణ, వ్యాపార సముదాయా లను పూర్తిగానో పాక్షికంగానో తొలగించాల్సి వచ్చేది. కోర్టుల్లో వివాదాలు వంటి అనేక సమస్యలు వచ్చే వీలుంది. ఇప్పుడు ఈ సమస్యలేవీ లేకుండా పైవంతెనతో పరిష్కారం చూపనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: