KTR-“కాళేశ్వరానికి సంబంధించి 85 పిల్లర్లలో రెండు పిల్లర్లు కూలిపోతే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హంగామా చేస్తున్నారు కదా. పిల్లర్ల మరమ్మతు ఏజెన్సీకి చెప్పినా పనులు పూర్తి చేస్తారు. అయితే కావాలని కేసీఆర్పై కేసులు పెట్టాలన్న ఆలోచన ద్వారా రాజకీయ కుయుక్తుతో పైశాచికానందం పొందుతున్నావు కదా. మరీ 90శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎందుకు పూర్తి చేయరని, ఇక్కడ ఏ ఆటంకం లేదు కదా. కేవలం 10శాతం పనులు చేయడానికి మనసు ఎందు రావడం లేదు. 22నెలలు సరిపోలేదా” అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని(Revanth Reddy) ప్రశ్నించారు.

పాలమూరు వెనుకబాటుకు కారణాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు ప్రస్తుత కాంగ్రెస్, గతంలో అధికారంలో ఉన్న టీడీపీలు కారణమని ఇదే విషయాన్ని గతంలో పార్టీ మారక ముందు రేవంత్‌రెడ్డి కూడా చెప్పాడని గుర్తుచేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని, సమస్యలు తీరుతాయని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru-Ranga Reddy Project)పనులు పూర్తి అవుతాయని చెప్పారు. అయితే 12 స్థానాలలో గెలిపించినప్పటికీ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ 22 నెలల కాలంలో ప్రాజెక్టును పడావు పెట్టడంలో అంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు.
కేసీఆర్ పాలనలో సాధించిన పురోగతి
కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 90శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10శాతం పనులను పూర్తి చేయకుండా ప్రాజెక్టును నిలిపివేశారని ఆరోపించారు. కేఎస్ఐ, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా డీపీఆర్ లేకుండా నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పనులను రూ.4000 కోట్లతో చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా(Palamuru District) ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే పోరాటాలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ ఎవరిని ప్రశ్నించారు?
సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతవరకు పూర్తైంది?
కేసీఆర్ హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి.
Read hindi news:hindi.vaartha.com
Read Also: