సంపులో నీరుతోడేందుకు దిగిన కార్మికులు
శ్వాస ఆడక ముగ్గురి మృతి
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) : మిషన్ భగీరధ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఉంజుపల్లి గ్రామంలో పెను విషాదం జరిగింది. పూసుగుప్ప పంచాయతీ పరిధిలోని ఉంజుపల్లి వద్దిపేట పూసుగుప్ప గిరిజన గ్రామాల ప్రజల దాహర్తిని తీర్చేందుకు మిషన్ భగీరధ పథకం (Mission Bhagiratha Scheme) (గ్రిడ్) ఆధ్వర్యంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో సంపు పంపు హౌస్ నిర్మాణ పనులకు చేపట్టి పూర్తికావచ్చాయి. ఈ క్రమంలో సంపులో ఉన్న నీటిని తోడేందుకుదుకు మోటర్ అమర్చేందుకు అక్కడ పనిచేస్తున్న కార్మికుడు అందులోకి దిగారు.
నలుగురు, ఊపిరి ఆడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
అకస్మాత్తుగా శ్వాస కోస సంభందిత ఇబ్బందులు (Breathing problems) తలెత్తడంతో కార్మికుడు ఇబ్బంది పడి కేకలు వేయడంతో అతన్ని రక్షించేదుకు మరో కార్మికుడు దిగాడు. ఇలా ఒకరి తర్వాత మరొఇద్దరు వారిని రక్షించేందుకు అపక్రమించి నలుగురు, ఊపిరి ఆడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని రక్షించేందుకు గ్రామస్తులు సహయక చర్యలు చేపట్టిన తోటి కార్మికుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. సహయక చర్యల కోసం పోలీస్ వైద్యశాల టోల్ ఫ్రీ నెంబర్లకు ప్రయత్నించారు. అంతలో గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఉంజుపల్లి బయలుదేరి,రక్షణ సహయక చర్యల్లో పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం కోసం భద్రాచలం వైద్య శాలకు తరలించే క్రమంలో
సిఐ రాజువర్మ నేతృత్వంలో ఎస్.ఐలు నర్సిరెడ్డి కేశవ్ తమ సిబ్బందితో సంపులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించారు. సిఐ రాజువర్మ (CI Raju Varma) మరో కానిస్టేబుల్ మిగిలిన కార్మికుల సహయంతో సంపులోకి దిగి ఒక్కొక్కరిని బయటకు తీసి అంబులెన్స్ సహయంతో హుటాహుటిన చర్ల సీహెచ్ సీ కి తరలించి ప్రాధమిక వైద్య చికిత్సలు అందించిన ఫలితం దక్కలేదు. అప్పటికే కాక మహేస్ (ఉంజుపల్లి) నీలం తులసిరామ్( లింగా పురం) ఇద్దరు కార్మికులు మృతిచెందరు.
మరో ఇద్దరు కార్మికులు అనసూరి అప్పలరాజు తడిగడ పల ఇస్సాకుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం వైద్య శాలకు తరలించే క్రమంలో ఇస్సాన్ అనే కార్మికుడు మృతిచెందడం విశేషం. ఆనసూరి అప్పలరాజును భద్రాచలం తరలించారు.రూ. 20 లక్షల నష్టపరిహారం ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బాధితకుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేసారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: