తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు స్పష్టంగా చెప్పడంతో తమిళనాడు మొత్తం ఆయన చుట్టూ రాజకీయ చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన తలపతి ప్రజా ఇయక్కం (Thalapathy People’s Movement) విస్తృత స్థాయిలో కార్యకలాపాలు చేపడుతోంది. ఇటీవల విజయ్ పాల్గొన్న పబ్లిక్ మీటింగులకు లక్షలాది మంది అభిమానులు, సాధారణ ప్రజలు తరలి రావడంతో, ఆయన తమిళ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.. విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల (Vijay, Sangeetha divorce rumors) గాసిప్స్ గత ఏడాదినుంచే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిషా పేరు కూడా ఈ వివాదంలోకి వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిషా గానీ స్పందించింది లేదు.తాజాగా విజయ్, సంగీత విడాకుల రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు
ఈ పుకార్ల మధ్య విజయ్ భార్య సంగీత తన కుమారుడు జేసన్ సంజయ్ తో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం మరింత చర్చనీయాంశమైంది. త్వరలోనే జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు కెరీర్ పరంగా విజయ్ ప్రస్తుతం “జన నాయకన్” సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన “భగవంత్ కేసరి” రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్, ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: