Nepal-నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హఠాత్తుగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఖాట్మండులోని ప్రధానమంత్రి కేపీ ఓలీ(KP Oli)అధికారిక నివాసానికి నిప్పు పెట్టడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజీనామా చేయాలని ఒత్తిడి పెడుతూ వేలాది మంది యువకులు వీధులలోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
కేపీ ఓలీ రాజీనామా డిమాండ్‌తో ఉద్రిక్తతలు
ప్రధాని తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ పరిసరాల్లో రహదారులను దిగ్బంధించారు. ఆ తరువాత వారు ఓలీ నివాసంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, భవనానికి నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినా ఆగ్రహం తగ్గలేదని స్పష్టమైంది.
ఈ దాడులు ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్ప కమల్ దహల్ (ప్రచండ), షేర్ బహదూర్ డ్యూబా గృహాలపై కూడా నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టారు. మంత్రులు, యూఎంఎల్ మరియు నేపాలీ కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలు కూడా దహనమయ్యాయి. అంతేకాకుండా ఖాట్మండులోని(Kathmandu) యూఎంఎల్, నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రధానమంత్రి కేపీ ఓలీ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు.
నేపాల్‌లో నిరసనలకు కారణం ఏమిటి?
ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
నిరసనకారులు ఎవరిపై దాడి చేశారు?
ప్రధాని నివాసం, అధ్యక్షుడు పౌడెల్ నివాసం, మాజీ ప్రధానులు దహల్, డ్యూబాల గృహాలు, పలువురు నేతల ఇళ్లు మరియు పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయి.
Read hindi news:hindi.vaartha.com
Read also: