Trump-అమెరికా అధ్యక్షుడిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. టారిఫ్ లను పెంచి, ఇతర దేశాలతో శత్రుత్వాన్ని కొనితెచ్చుకుంటున్నారు. ఇక వీసాల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, విదేశీయులను(Foreigners) గణనీయంగా అదుపు చేస్తున్నారు. తన దుందుడుకు నిర్ణయాలతో పలుమార్లు కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు వస్తున్నా తనకేమీ పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సొంత ప్రజలే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ట్రంప్ కు మరో భారీ షాక్ తగిలింది. కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో విచారించిన న్యూయార్క్ లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు..ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు (రూ.733 కోట్లు) చెల్లించాలంటూ ఆదేశించింది. ఇటీవల సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ట్రంప్ చేసిన అప్పీల్ ను తోసిపుచ్చింది. జ్యూరీ విధించిన పరిహారం కరెక్ట్ గానే ఉందంటూ తీర్పునిచ్చింది.

అధ్యక్షుడిగా తనకు మినహాయింపు
ఈ కేసులో అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొందని తాను పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ కోర్టులో వాదించారు. దీన్ని ఫెడరల్ అప్పీల్స్(Federal Appeals) కోర్టు తిరస్కరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే..1996లో మన్‌హట్టన్ డిపార్ట్మెంట్ స్టోర్ లోట్రంప్.. కరోల్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో కోర్టు ఆయనకు 5 మిలియన్ డాలర్లు (రూ.400 కోట్లు) జరిమానా విధించింది.
కరోల్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన ట్రంప్
సోషల్ మీడియాలో ట్రంప్ తరచుగా జీన్ కరోల్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై వ్యక్తిగతంగా వివాదాస్పద ఆరోపణలు చేశారు. దీంతో కరోల్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్‌పై పరువునష్టం కేసు చేశారు. చివరికి దీనిపై విచారణ జరిపిన కోర్టు రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హర్వర్డ్ యూనివర్సిటీకి నిధులను ఆపివేసిన ట్రంప్ ఇటీవల యధాతధంగా నిధులను ఇవ్వాల్సిందే అని కోర్టు తీర్పునిచ్చింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అనేకులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పలు కేసుల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగానే తీర్పులు రావడం గమనార్హం.
ట్రంప్‌పై కోర్టు ఎంత మొత్తం చెల్లించమని ఆదేశించింది?
ట్రంప్ రూ.733 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ కేసు ఏ అంశంపై నమోదైంది?
పరువునష్టం కేసు కింద ఈ కేసు నమోదు అయింది.
Read hindi news:hindi.vaartha.com
Read also: