Vice President Elections-నేడు (మంగళవారం) భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ(Modi) ఎన్డీయే తరపున తొలి ఓటు వేశారు. సాయంత్రం ఐదుగంటల వరకు పోలింగ్జ రగనుంది. పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాలీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. రెండు ప్రధాన కూటముల ఎంపీలు ఒకొక్కక్కరుగా పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలోకి చేరుకుంటున్నారు.
ఆ రెండు పార్టీలు ఎందుకు దూరంగా ఉన్నాయి?
ఒడిస్సాలోని బీజేడీ, తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలు అధికార ఎన్డీఏ కూటమికి లలేదా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించకపోవడం, ఓటింగ్లో పాల్గొనఁకుమా తటస్థంగా ఉండడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)నేతృత్వంలోని బీజేడీ, ఈ ఎన్నికలలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బీజేడీ రాజకీయ వ్యవహారాల కమిటీలో విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించిందిది. ఇది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి మధ్య తటస్థతను కొనసాగించాలనే బీజేడీ వ్యూహంగా కనిపిస్తుందిది. గతంలో బీజేడీ పలు బిల్లులకు మద్దతు ఇచ్చినా, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉండడం ఆసక్తికరమైన అంశం. జతీయ రాజకీయాల్లో బీజేడీ తన స్వతంత్రతను చాటుకోవాలని చూస్తున్నట్లు ఈ నిర్ణయం ద్వారా తెలుస్తోంది.

ప్రాతినిధ్యం లేనప్పటికీ బీఆర్ఎస్ దూరం
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో యూరియూ కొరిత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు ప్రకటించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యూరియా కొరత సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ‘నోటా’ ఆప్షన్ ఉండి ఉంటే దానిని ఉపయోగించుకునేవాళ్లమని, అయితే ఆ అవకాశం లేకపోవడంతో ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
వ్యూహం ప్రకారమే దూరం
బీజెడీ, బీఆర్ఎస్ పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా తమతమ రాజకీయ వ్యూహాలను అనుసరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేడీ తన తటస్థ వైఖరిని కొనసాగించాలని చూస్తుండగా, బీఆర్ఎస్ మాత్రం రైతు సమస్యలను ప్రధానంగా చేసి అధికార పార్టీలపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రభావం పెద్దగా లేకపోయినా, జాతీయ రాజకీయాల్లో భవిష్యత్ కార్యాచరణను సూచిస్తున్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. ఎంపీలు ఒకొక్కక్కరుగా పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలోకి చేరుకుని తమ ఓటును వినియోగించుకుంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పాల్గొనడం లేదు?
బీఆర్ఎస్ తమ జాతీయ రాజకీయ అజెండా ప్రకారం తటస్థంగా ఉండటమే కారణం.
బీజేడీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?
ఒడిశా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: