విజయవాడ : రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ మైనార్టీగా ఉన్న ప్రతి ఒక్కరికీ విద్య, ఉపాధి, ఆర్థికంగా ఎదగడానికి సమాన అవకాశాలు అందించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తోందని, వీటి ద్వారా మైనార్టీ ప్రజలు స్వయం ఉపాధి పొందేందుకు, వ్యాపారం ప్రారంభించేందుకు, విద్యాభివృద్ధికి, పర్యటనలకు సహాయం అందిస్తోందన్నారు. వ్యాపారం ప్రారంభించాల నుకునే మైనార్టీలకు బ్యాంకు లోన్పై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఇది వారి స్వయం ఉపాధిని పెం చడంలో ఉపయోగపడుతుందన్నారు.

కోచింగ్ సదుపాయాలను ఈపథకాల ద్వారా
విద్యలోముందడుగు వేయాలనుకునే విద్యార్థు లకు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్ మెంట్, కోచింగ్ సదుపాయాలను ఈపథకాల ద్వారా అందిస్తారన్నారు. పవిత్ర స్థలాలకు వెళ్ళే వారికి ప్రభుత్వం
ఆర్థిక సహాయం అందించి, వారి థార్మిక ప్రయాణానికి తోడ్పడుతుందని, ఇటీవల హజ్ యాత్ర (Haj Yatra) కు వెళ్ళిన వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించిందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణలు అందించి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని,
మైనార్టీలు చిన్న, సూక్ష్మ వ్యాపారాలను ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకునేందుకు తక్కువ వడ్డీకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలందిస్తామన్నారు. మైనార్టీ సమాజానికి ప్రభుత్వంఅందిస్తున్న సహాయాలను సద్విని యోగం చేసుకొని విద్యలో, వ్యాపారంలో ముం దడుగు వేసి సమాజ అభివృద్ధికి తోడ్పడదామని పిలుపునిచ్చారు. తనను డైరెక్టర్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ రావు లకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news:
Read Also: