అన్నదాతలను ఓదార్చిన కాంగ్రెస్ చీఫ్ షర్మిల
కర్నూలు కార్పొరేషన్ : ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల డిసిసి అధ్యక్షులు, కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎ ఐ సి సి మెంబర్ జే లక్ష్ నరసింహ యాదవ్ మరియు కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష గారి ఆధ్వర్యంలో ఉల్లి రైతుల పరామర్శ కార్యక్రమంలో షర్మిలా రెడ్డి మాట్లాడుతూ ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు కర్నూల్ మార్కెట్ యార్డుకు రావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి తెలియజేశారు.
ఉల్లి పండించిన రైతులు ఆందోళన చెందుతున్నారని
ఉల్లి రైతులు పండించిన ధరకు అమ్ముతున్న ధరకు పొంతనలేదని ఉల్లి రైతులు కన్నీరు పెట్టుకునే స్థితిలో ఉన్నారని ఉల్లి పండించిన రైతులు (Farmers who grew onions) ఆందోళన చెందుతున్నారని ఇబ్బందులు పడుతున్నారని వారిని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుందని ఉల్లి పండించడానికి ఎకరానికి ఎనబై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడీ అవుతుందని రైతులు చెబుతున్నారని కానీ క్వింటాలుకు 600 రూపాయల కంటే రావడం లేదని గత సంవత్సరం క్వింటాలకు 4 వేల నుండి 5 వేల రూపాయల వరకు ఉల్లి అమ్ముడుపోయిందని ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైందని దళారులు మంచి గ్రేడ్ అయితే కేవలం 600కు కొంటున్నారని రెండో రకం.

ఇద్దరు రైతులు ఆత్మహత్యయత్నం చేసుకోబోతే
అయితే రెండు వందలు మూడు వందలు కొంటున్నారని పండించిన పంటలో పెట్టుబడులు కనీసం సగం కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారని మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్యయత్నం చేసుకోబోతే వైసీపీ కార్యకర్తలు అంటూ ముద్రవేసి వారిపై కేసులు పెట్టారని రైతులకు, పండించిన పంటలకు కూడా పార్టీలు ఉంటాయా అని ఇప్పుడే అర్థమైందని షర్మిలమ్మ ప్రశ్నించారు.ఏ ఒక్క రైతుకు 1200 మద్దతు ధర ఇవ్వలేదని ఉల్లి రైతులపై దృష్టి పెట్టి డిఫరెంట్ అమోంటు వేయాలని,
మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్
ఉల్లికి కనీస మద్దతు ధర 2400 రూపాయలు కల్పించాలని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల ఖాతాలో క్వింటాలుకు 1200 రైతుల ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిలా రెడ్డి గారు తెలియజేశారు. ముందుగా పిసిసి అధ్యక్షులు షర్మిలా రెడ్డి గారు నేరుగా కర్నూలు మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చి ఉల్లి రైతులు ఉల్లి రైతుల వద్దకు వెళ్లి ముఖాము ఖిగా వారితో మాట్లాడి కుటుంబ ప్రభుత్వంతో మాట్లాడి మీకు తప్పకుండా మద్దతు ధర వచ్చే విధంగా కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించారు.
Read hindi news:
Read Also: