Latest News : 40 ఏళ్ల వయసులోనూ తన అందం, నటనతో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న త్రిష, స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ (Latest News) మూవీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తుండగా, తమిళంలోనూ బిజీగా ఉంది.
ఇక తాజాగా త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో విజయ్‌తో త్రిషకు సన్నిహిత సంబంధం ఉందన్న రూమర్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలసి టూర్స్, వెకేషన్స్‌లో కనిపించడం వల్ల ఈ వార్తలు మరింత హైలైట్ అయ్యాయి. అయితే త్రిష మాత్రం “మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే” అంటూ స్పష్టం చేసింది.
కానీ ఇటీవల సైమా అవార్డ్స్ 2025లో విజయ్ గురించి మాట్లాడుతూ త్రిష “విజయ్ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు. అతని కల ఏదైనా అది నిజమవుతుంది ఎందుకంటే అతను అర్హుడు” అని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె సిగ్గుపడటమే అభిమానుల్లో మరోసారి పెళ్లి వార్తలకు ఊతమిచ్చింది. “ఏమీ లేనప్పుడు పేరు చెప్పగానే ఇంత సిగ్గు ఎందుకు?” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి రావడంపై కమల్ హాసన్ కూడా స్పందిస్తూ – “విజయ్ రాజకీయాల్లోకి రావాలని నేను చాలాకాలంగా ప్రోత్సహిస్తున్నాను. నేను ప్రోత్సహించిన వారిలో ముందుంటాను” అని తెలిపారు. అలాగే రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు.
Read also :