సెన్సేషనల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం స్పిరిట్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి ఎలాంటి ఫీట్స్ చేయిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఓ టాక్ షోలో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా, తాను ప్రభాస్‌ను చూసి భయపడ్డానని రివీల్ చేశాడు.
తనకు బాహుబలి 2 చిత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే చాలా ఇష్టమని, ఆ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులంతా కేకలు వేస్తూ అరవడం ఇప్పటికీ మర్చిపోలేదని అన్నారు. అలాంటి ఇంపాక్ట్ తాను క్రియేట్ చేయగలనో లేదో అనే సందేహంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ప్రభాస్ పర్ఫార్మెన్స్, క్రేజీ చూసి సందీప్ రెడ్డి భయపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక స్పిరిట్ సినిమాలో ఆయన ప్రభాస్‌ను ఎలా చూపెడతాడో చూడాల్సి ఉంది.