हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: AkhilaBharata-జైల్ డ్యూటీమీట్ 2025: రేపటి నుంచి ప్రారంభం.

Sushmitha
Telugu News: AkhilaBharata-జైల్ డ్యూటీమీట్ 2025: రేపటి నుంచి ప్రారంభం.

AkhilaBharata: తెలంగాణ జైళ్లు, సవరణాశాఖ ఆధ్వర్యంలో 7వ అఖిల భారత జైలు డ్యూటీ మీట్-2025 ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాదులోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర జైళ్లు,(State prisons) సవరణ శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,300 మందికి పైగా జైలు సిబ్బంది (ఇందులో 184 మంది మహిళలు) పాల్గొని 36 విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తారని ఆమె పేర్కొన్నారు.

AkhilaBharata


ప్రత్యేకతలు, పోటీలు, అతిథులు

ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స, సంక్షేమ పథకాలు, క్విజ్, కంప్యూటర్ నైపుణ్యం వంటి వృత్తి సంబంధిత పోటీలతో పాటు అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, కరాటే, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి క్రీడలు, సాంస్కృతిక పోటీలు కూడా ఉంటాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమాన్ని రెండవసారి నిర్వహిస్తోంది. గతంలో 2015లో తొలిసారి నిర్వహించగా, 2022లో అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జైలు డ్యూటీ మీట్‌లో తెలంగాణ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించింది. ఈసారి తొలిసారిగా ఆల్ ఇండియా టెక్నో ఎక్స్‌పో, జైలు ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి.

సన్నాహక కార్యక్రమంలో భాగంగా డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలంగాణ జట్టు సభ్యులైన 84 మందికి క్రీడా కిట్లను పంపిణీ చేసి, జాతీయ స్థాయిలో క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో(confidence) రాణించాలని ప్రోత్సహించారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 9న ఉదయం 9:30 గంటలకు హిమాయత్ సాగర్‌లోని పోలీస్ అకాడమీలో రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జైలు డ్యూటీ మీట్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తదితరులు పాల్గొంటారని ఆమె చెప్పారు.

జైలు డ్యూటీ మీట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఈ నెల 9 నుండి 11 వరకు హైదరాబాదులోని ఆర్‌బీవీఆర్‌ఆర్ (తెలంగాణ పోలీస్ అకాడమీ)లో జరగనుంది.

ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటారు?

దేశంలోని 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,300 మందికి పైగా జైలు సిబ్బంది పాల్గొంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/indian-hockey-team-wins-asia-cup/sports/543012/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో సంక్షోభం ప్రభుత్వ జోక్యంతో ₹610 కోట్ల రీఫండ్లు…

ఇండిగో సంక్షోభం ప్రభుత్వ జోక్యంతో ₹610 కోట్ల రీఫండ్లు…

మావోయిస్టులకు భారీ షాక్

మావోయిస్టులకు భారీ షాక్

బాబ్రీ మసీదు తరహా మసీదు కార్యక్రమం తర్వాత కీలక ప్రకటన…

బాబ్రీ మసీదు తరహా మసీదు కార్యక్రమం తర్వాత కీలక ప్రకటన…

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

డిసెంబర్ 8న లోక్‌సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

డిసెంబర్ 8న లోక్‌సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

ఆఫర్లున్నా.. BSNLవైపు ఆసక్తి చూపని యూజర్లు

ఆఫర్లున్నా.. BSNLవైపు ఆసక్తి చూపని యూజర్లు

కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

గోవాలో భయానక అగ్ని ప్రమాదం నైట్‌క్లబ్‌లో 25 ప్రాణాలు…

గోవాలో భయానక అగ్ని ప్రమాదం నైట్‌క్లబ్‌లో 25 ప్రాణాలు…

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

📢 For Advertisement Booking: 98481 12870