Delhi traffic : ఆగ్రాలో యమునా నది నీటి మట్టం ఆదివారం మరింత పెరిగి ప్రమాద స్థాయిని దాటి తాజ్ మహల్ గోడల వరకు చేరింది. నదీ తీర ప్రాంతంలో నివసించే కొందరి ఇళ్లలోకి కూడా నీరు చేరింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల యమునా నీరు పెరిగిందని అధికారులు తెలిపారు. స్థానిక చరిత్రకారుడు రాజ్ కిశోర్ రాజే ప్రకారం, (Delhi traffic) 2023లోలాగే ఈసారి కూడా నీటి మట్టం తాజ్ మహల్ గోడల వరకు చేరినా, స్మారక చిహ్నానికి ఎటువంటి నష్టం కలగలేదని అన్నారు. జిల్లా అధికారులు వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

ఇక ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. 12 కీలక రహదారి మార్గాల్లో పరిశీలనలు జరిపి, కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి, రౌండబౌట్ల పరిమాణం తగ్గించి, అదనపు సిబ్బంది నియమించారు. మజ్నూ కా టిల్లా, మంగీ బ్రిడ్జ్ రోడ్, రాణి ఝాన్సీ రోడ్, ఆనంద్ విహార్, ఖజూరి చౌక్, NH-48 వంటి రహదారుల్లో కొంత ఉపశమనం లభించినా, ప్రధాన సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఎంక్రోచ్మెంట్ తొలగింపు, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్ల విస్తరణ, డ్రెయినేజ్ మరమ్మతులు, పార్కింగ్ సదుపాయాలు వంటి పనులు civic agencies స్థాయిలో పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ చర్యలు పూర్తిగా అమలు చేస్తే నగర ట్రాఫిక్‌లో గణనీయమైన మెరుగుదల వస్తుందని అధికారులు తెలిపారు.

