సినీ ఇండస్ట్రీలో అభిమానులు, హీరోల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటినుంచో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక హీరో సినిమా విడుదలైనప్పుడు ఫ్యాన్స్ చేసే హంగామా, థియేటర్లను పండుగ వాతావరణంలో ముస్తాబు చేయడం, పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం, హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపడం వంటి విషయాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అభిమానులు తమ ఇష్టమైన హీరోకు అంకితభావంతో ఉండటమే కాకుండా, ఆ హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఆయన సినిమాలు ఎలా ఉన్నా అండగా నిలబడతారు. అయితే, ఈ ప్రేమ ఒకపక్కనుండి మాత్రమే ఉండదు. అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు హీరోలు కూడా వారిని ఆదుకునే ఘటనలు చాలానే ఉన్నాయి.
అలాంటి ఓ సంఘటన ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని, ఏలూరు సిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కరస్పాండెంట్ (NTR Fans Association Correspondent) గా పనిచేస్తున్న సోమేశ్ అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా అతను ఇప్పటికే తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఇప్పుడు పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో చివరి ఆశగా ఆయన సోషల్ మీడియాను ఆశ్రయించాడు. తన బాధను ట్విట్టర్ ద్వారా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర హీరోల అభిమానులతో పంచుకున్నాడు.
మంచు మనోజ్,బెల్లంకొండ శ్రీనివాస్
ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్‌మీడియా (Social media) లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్య సమస్యల వల్ల నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఖర్చయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమీలేదు. ఆర్థికంగా పూర్తిగా వెనకబడ్డాను. ఒక దశలో సూసైడ్ కూడా అనుకున్నా… దాకా వెళ్లాను కూడా. కానీ నా పిల్లల కోసం నా కుటుంబం కోసం మళ్లీ బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ఈ పరిస్థితిలో చివరికి ఒక్క ఆశతో నా బాధను ట్విట్టర్‌లో నా ఫ్రెండ్స్, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర హీరోల ఫ్యాన్స్‌తో పంచుకున్నాను.
కొంతమంది స్పందించి కొంత ఆర్థిక సాయం అందించారు. ఇంకా సుమారు రూ.2లక్షల వరకు అవసం ఉంది. మిమ్మల్ని నా కుటుంబసభ్యుల్లా భావిస్తూ ఈ క్లిష్ట సమయంలో మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరిచ్చే ఒక్క రూపాయే నా జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సహాయం చేసిన వాళ్లకి నా కృతజ్ఞతలు. నా ఫోన్ నంబర్.. 7780335269’ అంటూ ఆయన పోస్ట్ చేశారు.సోమేష్ పోస్టుకి స్పందించి చాలామంది నెటిజన్లు ఆయనకు సాయం చేస్తున్నారు. తాము పంపిన డబ్బులకి సంబంధించి స్క్రీన్ షాట్లు తీసి షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోలైన బెల్లంకొండ శ్రీనివాస్ , మంచు మనోజ్ కూడా స్పందించారు.

ఇటీవల విడుదలై యావరేజ్ హిట్
సోమేశ్ పోస్టుకి మంచు మనోజ్ రియాక్ట్ అవుతూ.. ధైర్యంగా ఉండు తమ్ముడు. మేమంతా నీతోనే ఉన్నాం. లవ్‌యూ. నీ నంబర్ పంపించు’ అని ట్వీట్ చేయగా సోమేశ్ ఆయనకు తన ఫోన్ నంబర్ షేర్ చేశాడు. ‘హలో బ్రదర్. ప్రమోషన్ల కోసం రేపు నేను విజయవాడకి వస్తున్నాం. అక్కడ నిన్ను కలుసుకుని నాకు వీలైనంత మేరకు సాయం చేస్తా’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ట్వీట్ ఇచ్చాడు.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన ‘భైరవం’ సినిమా ఇటీవల విడుదలై యావరేజ్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్నాయి. ‘మిరాయ్’ చిత్రంలో మనోజ్ విలన్‌గా నటిస్తుండగా, బెల్లంకొండ శ్రీనివాస్ అదేరోజు ‘కిష్కిందపురి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read also: