Revanth Reddy-త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ వర్గాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 15న కామారెడ్డిలో “బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను”(BC Declaration Victory Celebration)” ఘనంగా నిర్వహించనుంది. ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారానికి శుభారంభం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

జాతీయ నేతల హాజరుతో ప్రతిష్ఠాత్మక సభ
ఈ విజయోత్సవ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. లక్ష మందికి పైగా జనసమీకరణ చేసి ఈ సభను చారిత్రకంగా మార్చాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏర్పాట్లపై చర్చలు ప్రారంభం
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తదితర నేతలు సభ ఏర్పాట్లపై చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం కామారెడ్డిలో మరో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల నేతలు పాల్గొననున్నారు. అనంతరం సభ నిర్వహణ స్థలాన్ని పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు పరిశీలించనున్నారు.
బీసీ డిక్లరేషన్ నేపథ్యం
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య “బీసీ డిక్లరేషన్” ప్రకటించి, అధికారంలోకి వస్తే కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా ప్రభుత్వం కులగణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచుతూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది. అదే వేదికపై విజయోత్సవ సభ నిర్వహించడం ద్వారా బీసీ వర్గాలకు బలమైన సందేశం పంపాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
బీసీ విజయోత్సవ సభ ఎప్పుడు జరుగుతుంది?
ఈ సభ సెప్టెంబర్ 15న కామారెడ్డిలో జరుగుతుంది.
ఈ సభకు ఎవరు హాజరవుతున్నారు?
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారు
Read hindi news:hindi.vaartha.com
Read also: