మలయాళ సినీ పరిశ్రమలో మరో మాసివ్ హిట్‌గా నిలుస్తున్న చిత్రం “లోకా: చాప్టర్ 1 – చంద్ర”. (Lokah Chapter 1) దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే ₹101 కోట్ల భారీ వసూళ్లు సాధించడం విశేషం.ఈ సినిమాకు దర్శకుడు డామినిక్ అరుణ్ ప్రత్యేకమైన కథను ఎంచుకున్నారు.
మలయాళ జానపదంలోనుండి తీసుకున్న అంశాలను ఆధారంగా చేసుకుని, దానిలోకి సూపర్ వుమన్ కాన్సెప్ట్‌ను జోడించారు. ఈ ప్రయత్నం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించింది. ప్రధాన పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటించగా, హీరోగా నస్లెన్ కె. గఫూర్ కనిపించాడు. వారి నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
ప్రియాంక చోప్రా, ఆలియా భట్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు
ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లోని ప్రముఖ నాయికలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్ (Alia, Priyanka) ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కథ, దర్శకత్వం, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించి చర్చ నడుస్తోంది.
భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో సినిమా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు నిర్మాత దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్రయూనిట్‌కి అభినందనలు. ఈ సినిమా మలయాళంలో అందరి హృదయాలను గెలుచుకురి ఇప్పుడు హిందీలో అందుబాటులోకి వచ్చింది. నేను ఇప్పటికే ఈ సినిమాను నా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకున్నాను. మీరు చూశారా అంటూ ప్రియాంక రాసుకోచ్చింది.

ఆదరణ చూసి
ఆలియా భట్ ఈ మూవీపై స్పందిస్తూ.. పౌరాణిక జానపదం, మిస్టరీ యొక్క అద్భుతమైన సమ్మేళనం ఈ లోక. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి విభిన్నమైన సినిమాకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినిమా రంగానికి ఇది ఒక మంచి అడుగు అని నేను భావిస్తున్నాను. అంటూ ఆలియా భట్ రాసుకోచ్చింది.
Read hindi news : hindi.vaartha.com
Read also: