తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లండన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) పిలర్ల కుంగిపోవడాన్ని ఆసరాగా తీసుకుని రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు.
మూడు పిల్లర్లు కుంగితే అంత హడావుడా?
హరీశ్ రావు మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీలో కేవలం మూడు పిల్లర్లు కుంగిపోవడమే నెపంగా ప్రభుత్వం పెద్ద ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నో నెలలు గడిచినా ప్రజలకు మేలు ఏమీ జరగలేదని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం పూర్తయినా ప్రజలకు గణనీయమైన మేలు చేయలేకపోయిందని హరీశ్ పేర్కొన్నారు. “ఇంతకాలం ఏం చేసింది ఈ ప్రభుత్వం?” అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.
వానాకాలం విద్యుత్ అవసరాలు తక్కువ – మోటార్లతో నీటిని ఎత్తడం సులువు
వానాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువ (Electricity demand is low)గా ఉంటుందనీ, అటువంటి సమయంలో ‘బాహుబలి’ మోటార్లను ఉపయోగించి నీటిని సులభంగా ఎత్తిపోసుకోవచ్చని హరీశ్ వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం దానికీ అమలు చేయలేకపోతోందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని ఆరోపణ
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయిందని, పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని హరీశ్ వ్యాఖ్యానించారు. ఎన్నారైలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు.
కేసీఆర్‌నే బీఆర్ఎస్‌కు సర్వస్వంగా పేర్కొన్న హరీశ్
పార్టీ గురించి మాట్లాడుతూ, బీఆర్ఎస్‌కు అధినేత కేసీఆర్‌గారే అన్ని విషయంలో తుది నిర్ణయాధికారి అని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలా సేవ చేయాలో తనకు కేసీఆర్ నేర్పించారని, అదే తన రాజకీయ ప్రేరణ అని హరీశ్ చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: