గుంతకల్లు Railways : రైల్వే వినియోగదారుల సమస్యల పరిష్కారానికి దక్షిణ మద్య రైల్వే అహర్నిషలు కృషి చేస్తుందని జనరల్ మేనేజర్, జెడ్ఆర్ యూసిని చైర్మన్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, డిప్యూటీ జనరల్ మేనేజర్, కార్యదర్శి ఉదయ్ నాథ్ కోట్లలు అన్నారు. రైల్ నిలయంలో నిర్వహించిన 76వ జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపి రాష్ట్రానికి చెందిన ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, అమలాపురం ఎంపి జీఎం హరీష్ బాలయోగి, సభ్యులు రవి అగర్వాల్, కె నాగేశ్వర్ రావు, ఎ వెంకట రంగయ్య తో పాటు మరో 17 మంది సభ్యులు, దక్షిణ మధ్య రైల్వేకి చెందిన వివిధ విభాగాల ప్రధాన అధిపతులు పాల్గొన్నారు.
రైల్వే విజయాలు
ఈ సందర్భంగా చైర్మన్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, కార్యదర్శి ఉద యానాథ్ కోట్లలు సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రైల్వే జోన్ సాధించిన విశేష వనితీరును వివరించారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే తొలి ఐదు మాసాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓరిజినేటింగ్ revenue ను రూ.8,593కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించామని తెలిపారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60.4 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న నూతన రైలు మార్గాలు మినహా వందశాతం విద్యుదీకరణ పూర్తి చేసామని, దక్షిణ మధ్య రైల్వే మీదుగా మొత్తం 6532రూట్ కి. మీలలో 4655రూట్ కి.మీలకు భారతీయ రైల్వేల స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అయిన కవచ్ తాజావర్షన్ 4.0మంజూరు చేయబడిందన్నారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
మౌలిక సదుపాయాల కల్పన, అనుసంధానం పెంపు గురించి వివరిస్తూ ప్రత్యేక శ్రద్ధతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశామని కాజీపేట-బల్హర్షా, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరుల మద్య త్రిప్లింగ్ రైలు మార్గాలు చివరి దశలో ఉన్నాయన్నారు. జోన్లో 78 స్టేషన్లలో సిసిటివి నిఘా వ్యవస్థ ఏర్పాటు, మరో 453 స్టేషన్లకు ప్రతిపాదనలు జరుగు తున్నాయి. స్టేషన్ పునరాభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 119 స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ బేగంపేట, కరీంనగర్, వరంగల్లు స్టేషన్లను మే 2025లో ప్రారంభించారని తెలిపారు. ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలను అందించడంలో భాగంగా 208 లిప్టులు, 92 ఎస్కలేటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయని, ఈ ఏడాది మరో 7 లిప్టులు, 4 ఎస్కలేటర్లను ప్రారంభించామని భద్రతా వేగవంతం చేశామని చెబుతున్నారు. infrastructure
దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత స్థూల ఆదాయం ఆర్జించింది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,593 కోట్ల స్థూల ఆదాయం ఆర్జించింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎన్ని స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోంది?
మొత్తం 119 స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోంది.
Read hindi news : hindi.vaartha.com
Read also :