విజయవాడ GST Slabs : జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్టు ట్వీట్ లో సీఎం సేఓ్కన్నారు. నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయన్న సీఎం ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకం. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందనీ పేర్కొన్న ముఖ్యమంత్రి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అభినందనలు తెలియచేస్తున్నాననీ ట్వీట్ లో పేర్కొన్న ముఖ్యమంత్రి పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ Next Generation జీఎస్టీ భారతీయుడి సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతీ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనీ స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
పేదలకు వరం – అభివృద్ధి కారకం
ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. ఈ నిర్ణయం పేదలకు వరంగా, అభివృద్ధి కారకంగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలోని వేర్వేరు వర్గాలకు, ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.. జీఎస్టీ స్లాబ్స్ తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అభినందనలు తెలియచేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కల్యాణ్ స్పందన
ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలపై ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఉద్ఘాటించారు. ఇప్పుడు జీఎస్టీ భారాన్ని తగ్గించడం ద్వారా తదుపరి తరం సంస్కరణలను ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు పవన్ కల్యాణ్. పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల ఆరోగ్య సంరక్షణకు ఇది గణనీయమైన ఉపశమనమని చెప్పుకొచ్చారు. విద్య, బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించడం వల్ల ప్రజలకు భారం లేకుండా ఉంటుందని వెల్లడించారు. పేదల భవిష్యత్తును మరింత వృద్ధి చేయడాన్ని తాను ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు. ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకు వచ్చినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో ఏ రంగాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది?
నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గడంతో రైతులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ నాయకులలో ఎవరు జీఎస్టీ సంస్కరణలను స్వాగతించారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరూ జీఎస్టీ సవరణలను స్వాగతిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :