Madharaasi Movie Review : ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో, శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మదరాసి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు (Madharaasi Movie Review) వచ్చింది. దర్శకుడు మురుగదాస్, హీరో శివ కార్తికేయన్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు. శివ కార్తికేయన్ నటించిన ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ వంటి సినిమాలు తెలుగులో మంచి విజయాలు సాధించాయి. ఇక మురుగదాస్ తీసిన ‘గజిని’, ‘సెవెంత్ సెన్స్’, ‘తుపాకీ’ వంటి చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి సినిమాలను కూడా తెరకెక్కించారు.
ప్రస్తుతం విడుదలైన ‘మదరాసి’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ట్విట్టర్‌లో వరుసగా పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని క్రింజ్ సీన్లు ఉన్నప్పటికీ, సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ బ్యాక్‌బోన్‌లా నిలిచింది.
కమర్షియల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో లవ్, యాక్షన్ డ్రామా ను ఏఆర్ మురుగదాస్ అద్భుతంగా డీల్ చేశారని రివ్యూలలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, మొదటి 40 నిమిషాలు అంతగా ఆకట్టుకోకపోయినా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది అని రివ్యూలలో చెబుతున్నారు.
Read also :