Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు కు చెందిన 3,10నంబరు గేట్లులీక్ కావడంతో దిగువకు వృధాగా నీరు పోతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న శ్రీశైలం డ్యామ్కు (Srisailam Dam) వర్షాకాలం ఆరంభంలో మరమ్మతులు చేశారు. గేట్లకు లక్షల రూపాయలు వ్యయంచేసి రబ్బరు సీళ్ళు బిగించారు. రెండునెలలుకూడా కాకముందే లీకేజి అరికట్టాల్సిన రబ్బరు సీళ్ళు విఫలమైనాయి. ఇంజనీర్ల పర్యవేక్షణ లేకవడంతో తూతూ మంత్రంగా ఆపరేషన్ అండ్ మేంటనెన్స్ పనులు చేయడంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. శ్రీశైలం డ్యామ్ ఉనికి ప్రమాదంగా లీకేజి మారింది. ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయం త్వరగా నిండింది. కానీ ఆ నీటిని నిలుపుకోలేని పరిస్థితి నెలకొంది. శ్రీశైల జలాశయానికి జూరాల నుంచి ఈ ఏడాది జూన్ 1 నుంచి, సుంకేసుల నుంచి జులై 5 నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. బుధవారం నాటికి 1133.57 టీంఎంసీల వరద నీరు (Flood water of TMCs) వచ్చి చేరింది. 43 రోజుల పాటు శ్రీశైల జలాశయం గేట్లు ఎత్తారు. వరద తగ్గడంతో గేట్లు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో 883.20 అడుగులు, నీటినిల్వ 205.6627 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి( జూరాల, సుంకేసుల) 1,73,883 క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ 66,568 క్యూసెక్కులను నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యామ్‌లో లీకేజ్ ఎందుకు వచ్చింది?
గేట్లకు అమర్చిన రబ్బరు సీళ్ళు రెండునెలలోనే విఫలమవడం వల్ల లీకేజ్ ఏర్పడింది.
ప్రస్తుతం జలాశయంలో ఎంత నీరు నిల్వ ఉంది?
సెప్టెంబర్ నాటికి జలాశయంలో 205.66 TMCల నీరు నిల్వగా ఉంది.
శ్రీశైలం వరద నీటిని ఎక్కడికి విడుదల చేస్తున్నారు?
విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,568 క్యూసెక్కులను నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :