లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి ఎంతో ఇష్టంగా కొన్న వస్తువు అమాంతంగా అది దేనికీ పనికిరాకుండా పాడైపోవడమో లేక నిర్వీర్యం కావడమో చూస్తుంటాం. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన బ్రిడ్జీలు, డ్యాములు, ఫ్లైఓవర్లు కూడా క్షణాల్లో కూలి పోవడం చూస్తుంటాం. ఇలాంటిదే ఓ నౌక అమాంతంగా నీటిలో మునిగిపోయింది. దీనికి సంబందించిన వీడియో వైరల్‌గా మారింది.
టర్కీ తీరంలో జరిగిన సంఘటన
జోంగుల్జాక్ తీరంలోని మెడ్ ఇల్మాజ్ షిప్‌యార్డ్‌లో ఈ నౌకను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం కోసం 1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ.8.74 కోట్లు(Rs.8.74 crore) ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితం ఈ నౌకను ప్రారంభించారు. అదే సమయంలో ఈ నౌకలో కొందరు ప్రయాణికులు, సిబ్బంది కూడా ఉన్నారు. లగ్జరీ నౌకలో(ship) ప్రయాణం చేస్తున్నామని మురిసిపోయారు అందరూ.
మునిగిన నౌక.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణీకులు
నౌక సముద్రంలో నడవడం ఆరంభమైంది. ఏమైందో ఏమో తెలియదు, సాంకేతిక కారణాలతో అమాంతంగా నౌక సముద్రంలో మునిగిపోయింది( drowned). వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు, సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అదృష్టం బాగుండి అందరూ క్షేమంగా ఒడ్డుకు చేరారు.
అయితే నౌక మునిగిపోవడం( drowned) చూసి దాని యజమాని, కెప్టెన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా చేసేదేం లేక వారు కూడా సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నౌకపోతే పోయింది, ప్రాణాలు దక్కాయి అని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: