రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే (Vasundhara Raje) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ (RSS Chief)హన్ భగవత్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రత్యేక భేటీ సుమారు 20 నిమిషాలు కొనసాగింది. జోధ్‌పూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే (Vasundhara Raje) , గురువారం రామ్‌డియోరా మందిరానికి వెళుతూ లాల్ సాగర్ ప్రాంతంలోని ఆదర్శ్ విద్యా మందిర్‌లో మోహన్ భగవత్‌ను కలిశారు. వారిద్దరి ప్రత్యేక సమావేశం సుమారు 20 నిమిషాలు కొనసాగింది. ఆమె సన్నిహితులు, పార్టీ నేతలు ఎవరూ కూడా సమావేశ గదిలో లేరు.

కాగా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో వసుంధర రాజే (Vasundhara Raje) ఏం చర్చించారు, ఏం మాట్లాడారు అన్నది తెలియలేదు. అయితే కొంత కాలంగా బీజేపీ కార్యకలాపాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా మోహన్ భగవత్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అనంతరం జోధ్‌పూర్‌లోని రెండు పుణ్యక్షేత్రాలైన సురాసాగర్‌లోని బడా రామద్వారా, రైకా బాగ్‌లోని జుగల్‌జోడి ఆలయాన్ని వసుంధర రాజే సందర్శించారు. సేనాచార్య అచలానంద గిరి మహారాజ్‌ను ఆమె కలిశారు. అలాగే పోఖ్రాన్ సమీపంలోని రామ్‌డియోరా మందిరాన్ని కూడా వసుంధర రాజే సందర్శించారు.
చరిత్రలో వసుంధర ఎవరు?
ఆమె గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు మరియు భారతదేశపు మొట్టమొదటి చిన్న తరహా పరిశ్రమలు మరియు వ్యవసాయ మరియు గ్రామీణ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు దీనిని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు అని పిలుస్తారు. 2003లో, ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి మహిళగా నిలిచారు.
రాజస్థాన్ అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ఎవరు?
మోహన్ లాల్ సుఖాడియా (31 జూలై 1916 – 2 ఫిబ్రవరి 1982) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అతను 17 సంవత్సరాలు (1954–1971) రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 38 సంవత్సరాల వయస్సులో అతను ముఖ్యమంత్రి అయ్యాడు మరియు రాజస్థాన్‌లో ప్రధాన సంస్కరణలు మరియు పరిణామాలను తీసుకురావడానికి బాధ్యత వహించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: