సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు ఏ స్థాయిలో పండగలా మారతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అభిమానులకు పండగే. తాజాగా రజనీకాంత్, సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ థియేటర్లలో ఘన విజయం సాధించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సెప్టెంబర్ 11 నుంచి ‘కూలీ’ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులకు ఇంట్లోనే సినిమా అనుభూతిని ఆస్వాదించే అవకాశం లభించనుంది.
మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు
థియేటర్లలో ‘కూలీ’కి వచ్చిన స్పందన గురించి చెప్పుకుంటే, రజనీకాంత్ ఎనర్జీ, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభ ప్రధాన హైలైట్‌లుగా నిలిచాయి. ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాల్లో రజనీ తన వయసును మరచిపోయేలా మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. రజనీ పాత్రలోని ఎమోషన్, యాక్షన్ రెండూ ప్రేక్షకులను కట్టిపడేశాయి.ఈ చిత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణ టాలీవుడ్ కింగ్ నాగార్జున పోషించిన సైమన్ పాత్ర. విశాఖపట్నం పోర్టు నేపథ్యంగా సాగే కథలో నాగార్జున ఓ డాన్‌గా రఫ్ఫుగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
గంభీరమైన యాక్టింగ్
ఆయన గంభీరమైన యాక్టింగ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి.తన స్నేహితుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న దేవా (రజనీకాంత్) అనే వ్యక్తి, పోర్టును తన ఆధీనంలో ఉంచుకున్న సైమన్ (నాగార్జున) అక్రమాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ చిత్ర కథాంశం.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతిహాసన్, ఉపేంద్ర, రచిత రామ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మరోసారి చూడాలనుకునే వారు సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
Read hindi news : hindi.vaartha.com
Read also: