హైదరాబాద్ : పార్టీలో కొనసాగుతూ.. పార్టీ నియమాలు, విధానాలను ధిక్కరిస్తేవారు ఎంతటివారైనా సరే నిరాక్షిణ్యంగా సస్సెండ్ చేయాల్సిందేనని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. బుధవారం కల్వకుంట కవిత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులపై చేసిన ఆరోపణలపై మలారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారన్నారు.

కన్నబిడ్డ కన్నా ప్రజలు, తెలంగాణే ముఖ్యమన్నారు
పార్టీకి నష్టం చేకూర్చే ఎవరినీ ఊపేక్షించేది లేదని, తమ పార్టీ అధినేత కెసిఆర్‌కు (KCR) కన్నబిడ్డ కన్నా ప్రజలు, తెలంగాణే ముఖ్యమన్నారు. కుటుంబంలో సమస్యలు సర్వసాధారణమని అవన్ని త్వరలోనే సమసిపోతాయని కామెంట్ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మండిపడ్డారు. సిబిఐ పేరుతో కేసి ఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మనందరికీ నాయకుడిగా ఉండటం అదృష్టమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :