హైదరాబాద్ Mallu Ravi : మనుషులను చంపితే నక్సలిజం పోదని కాంగ్రెస్ పార్టీ ఎంపి మల్లు రవి అన్నారు. బిజెపి అంటేనే బిజినెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. నక్సల్స్కు ఒక ఫిలాసఫీ, సిద్ధాంతం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిలేదని ఎంపి మల్లు రవి పార్టీ నాయకులు రాములు నాయక్, శ్యాంమోహన్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
సామాజిక అసమానతలపై చర్చ
పేదప్రజలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలన్నది ముఖ్యమంత్రి అభిమతమని మల్లు రవి అన్నారు. నక్సల్స్ కూడా సామాజిక ఆర్థిక అసమానతలు దూరం కావాలని కోరుకుంటారని ఆయన తెలిపారు. సల్వాజుడుం విషయంలో వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్రెడ్డిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని బిజెపి నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అనడంలో అర్థం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం వాళ్లు, వాళ్లనువాళ్లే చంపుకునే వ్యవస్థను జస్టిస్ సుదర్శన్రెడ్డి వ్యతిరేకించారని ఆయన వివరించారు.

తీవ్రవాదం, నక్సలిజం తేడా
ప్రతిపౌరుడికి అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే నక్సల్స్ ఫిలాసఫీని ముందుపెట్టుకోవడంలో తప్పేమి లేదన్నారు. అంతమాత్రాన తీవ్ర వాదాన్ని ప్రోత్సహించినట్లు కాదన్నారు. టెర్రరిజానికి, నక్సలిజానికి తేడా ఉందని మల్లు రవి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కేంద్ర హోంమంత్రి అమిత్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
మల్లు రవి నక్సలిజంపై చేసిన ప్రధాన వ్యాఖ్య ఏమిటి?
మనుషులను చంపడం ద్వారా నక్సలిజాన్ని ఆపలేమని, సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం ముఖ్యం అని చెప్పారు.
సల్వాజుడుం కేసులో మల్లు రవి ఏం సూచించారు?
జస్టిస్ సుదర్శన్రెడ్డి తీర్పు న్యాయబద్ధమని, సల్వాజుడుం వ్యవస్థలో తప్పులు ఉన్నాయని ఆయన వివరించారు.
Read hindi news : hindi.vaartha.com
Read also :